ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) జన్మదినం ఈ రోజు. పలువురు ప్రముఖులు జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణులు జగన్ జన్మదినం సెలబ్రేట్ చేస్తున్నారు. పార్టీ ముఖ్యులు.. కార్యకర్తలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా జగన్ కు శుభాకాంక్షలు అందుతున్నాయి.
Read Also: Telugu Desam Party: పార్టీనే అందరికీ సుప్రీం: మంత్రి లోకేశ్
జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు
కాగా, సీఎం చంద్రబాబు జగన్ కు (YS Jagan) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ‘‘వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయువు పొందాలని కోరుకుంటున్నా” అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆయురారోగ్యాలతో జగన్ సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేశ్ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: