రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. Comptroller and Auditor General (CAG) తాజా నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో రాష్ట్రాల అప్పులు దాదాపు మూడింతలుగా పెరిగి, బడ్జెట్ నిర్వహణపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడిందని CAG హెచ్చరించింది. ఈ నివేదిక దేశవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు, మీడియా, రాజకీయ వర్గాల చర్చకు కేంద్రంగా మారింది.CAG అధిపతి కె. సంజయ్ మూర్తి రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశంలో ఈ నివేదికను విడుదల చేశారు.
ఇందులో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 28 రాష్ట్రాల మొత్తం అప్పులు రూ.17.57 లక్షల కోట్లుగా ఉండగా, 2022-23 నాటికి ఇవి రూ.59.60 లక్షల కోట్లుకు చేరినట్లు వెల్లడించారు. పదేళ్లలోనైనా రాష్ట్రాల అప్పుల పెరుగుదల 3.3 రెట్లుకు చేరిందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. దీంతో రాష్ట్రాల బడ్జెట్ (State Budget) లో సింహభాగం వడ్డీలు, రుణాల చెల్లింపులకే సరిపోతోందని పేర్కొంది.తీసుకున్న అప్పులను ఆస్తుల కల్పనకు, పెట్టుబడులకు కాకుండా రోజువారీ రెవెన్యూ ఖర్చులకు,
‘గోల్డెన్ రూల్’ను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని
లోటును పూడ్చుకోవడానికి వాడుతున్నాయని కాగ్ తప్పుబట్టింది. ఆర్థిక నిర్వహణలో పాటించాల్సిన ‘గోల్డెన్ రూల్’ (Golden Rule) ను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు సహా 11 రాష్ట్రాలు ఈ విధంగా రుణాలను పక్కదారి పట్టిస్తున్నాయని పేర్కొంది. ఏపీలో నికర రుణాల్లో కేవలం 26 శాతమే మూలధన వ్యయానికి వెచ్చిస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది.రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) (GST) తో పోలిస్తే అప్పుల నిష్పత్తి కూడా ఆందోళనకరంగా పెరుగుతోందని కాగ్ తెలిపింది.

కాగ్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ ఏమంది?
2023 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పంజాబ్ అత్యధికంగా 40.35 శాతం రుణ నిష్పత్తితో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో నాగాలాండ్ (37.15%), పశ్చిమ బెంగాల్ (33.70%) ఉన్నాయి. మరోవైపు ఒడిశా (8.45%), మహారాష్ట్ర (14.64%), గుజరాత్ (16.37%) రాష్ట్రాలు మెరుగైన ఆర్థిక క్రమశిక్షణతో తక్కువ రుణ నిష్పత్తిని నమోదు చేశాయి.కాగ్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
కేంద్ర ప్రభుత్వం ‘నిర్బంధ సమాఖ్యవాదం’తో రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి కేంద్రం దిగజార్చుతోందని విమర్శించారు. జీఎస్టీ సెస్, ఏకపక్ష సుంకాలతో రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతున్నారని, దీనివల్లే అవి అప్పుల పాలవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: