విజయవాడ : సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ(Cabinet Sub-Committe Meeting) ముగిసింది. రుషికొండ ప్యాలెస్(Rushikonda Palace)వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ భవనాన్ని ప్రయో జనకరంగా వినియోగించేందుకు సిఫార్సులు చేశారు. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, డీబీవీ స్వామి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
Read Also: Trisha: పెళ్లి రూమర్స్ పై స్పందించిన త్రిష

భవనం నిరుపయోగంగా ఉండటం వల్ల ఖర్చులు భరించాల్సి వస్తోందని మంత్రులు తెలిపారు. నెలకు రూ.25 లక్షలు విద్యుత్ ఛార్జీలు, మెయిం టెన్స్ ఖర్చులు పెట్టాల్సి వస్తోందని పేర్కొ న్నారు. ఈ అంశంపై ప్రతిపాదనలు, సలహాలను పరిశీలించారు. ఆతిథ్యరంగానికి హోటల్ నిర్వహణ వంటి సలహాలపై చర్చించారు. ప్రజాభిప్రాయాలు కోరుతూప్రకటన ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. రుషికొండ భవనాన్ని(Cabinet Sub-Committe Meeting) విని యోగంలోకి తీసుకువచ్చి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై కసరత్తు చేశారు. ఈ సబ్కమిటీ త్వరలో ప్యాలెస్ వినియోగంపై ప్రభు త్వానికి నివేదిక సమర్పించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: