ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet) రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం దృష్ట్యా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ఊతమిచ్చే విధంగా రూ.672 కోట్ల ధాన్యం బకాయిలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఊరటనిచ్చే నిర్ణయంగా భావించవచ్చు. అలాగే, హడ్కో నుంచి ప్రభుత్వం తీసుకున్న రుణాలపై గ్యారంటీ ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమరావతిలో టెక్నాలజీ అభివృద్ధికి భారీ నిర్ణయాలు
నూతన రాజధాని అమరావతిని టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ను అమరావతిలో ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇది రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే ప్రాజెక్టులుగా అభివర్ణించవచ్చు. విద్యా, పరిశోధన రంగాల్లో రాష్ట్రానికి ఇది ఒక బలమైన అడుగుగా మారుతుంది.
పారిశ్రామిక, మౌలిక వసతుల రంగంలో మెరుగుదల
ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ.10వేల కోట్ల విలువైన రుణాలను సమీకరించేందుకు అనుమతి ఇవ్వడం ద్వారా మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. అలాగే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు, దాని విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాలు రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి గట్టినెగ్గుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also : Jagan Chittoor Tour : జగన్ పర్యటన వెనుక కుట్ర ఉంది – టీడీపీ