విజయవాడ: తాజాగా మద్యం కుంభకోణం కేసులో తాజాగా దర్శి వైకాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ బూచేపల్లి శివప్రసాదొడ్డి (Buchepalli Sivaprasadoddy)పేరు తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు మద్యం ముడుపుల సొమ్మును ఆయనకు అందచేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో దాఖలు చేసిన రెండో అనుబంధ అభియోగపత్రంలో శివప్రసాదొడ్డి పేరు ప్రస్తావించింది.

గతేడాది మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగ్గా, కొద్దిరోజుల ముందు అంటే ఏప్రిల్ 21,22 తేదీల్లో చెవిరెడ్డి భాస్కరరెడ్డి(Chevireddy Bhaskara Reddy), బాలాజీకుమార్ యాదవ్ ప్రకాశం జిల్లా పొదిలిలో ఉన్నట్లు అభియోగపత్రంలో పేర్కొంది. అదే సమయంలో బాలాజీకుమార్ యాదవ్ శివప్రసాద్ రెడ్డి తో పలుమార్లు ఫోన్కాల్స్ మాట్లాడారని వెల్లడించింది. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధి లోని పలువురు వైకాపా అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం మద్యం ముడుపుల సొమ్ము చేరవేతంతా చెవిరెడ్డి నేతృత్వంలోని సాగిందని సిట్ ఇప్పటికే ఆధారాలతో తేల్చింది.
ఈ క్రమం లోనే శివప్రసాదొడ్డికి మద్యం ముడుపుల సొమ్ము అందించినట్లు సిట్ గుర్తించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: