తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ తుఫాను మళ్లీ రేగింది. ఇటీవల సిట్ (SIT) దర్యాప్తు నివేదికలో తిరుమలకు సరఫరా అయిన నెయ్యి రసాయనాలతో కల్తీగా తయారైనదని తేల్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తీవ్రంగా స్పందించింది. పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, “భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించడం జగన్ మహా పాపానికి ఒడిగట్టినట్టే” అని తీవ్ర విమర్శలు గుప్పించింది. టీడీపీ ట్విట్టర్ (ఇప్పటి ఎక్స్) అకౌంట్‌లో ఈ విషయంపై వీడియోను షేర్ చేస్తూ, ప్రజల ఆగ్రహాన్ని రగిలించింది.
Breaking News – Delhi Blast : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబ్ బ్లాస్ట్..
టీడీపీ ఆరోపణల ప్రకారం.. ఈ సంఘటన సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న కాలంలో జరిగిందని, భోలే బాబా డెయిరీ నుండి సరఫరా అయిన నెయ్యిలో రసాయన పదార్థాలు ఉన్నట్లు సిట్ విచారణలో తేలిందని పేర్కొంది. టీడీపీ నేతలు దీన్ని భక్తుల విశ్వాసానికి మోసం చేసిన ఘటనగా అభివర్ణిస్తున్నారు. తిరుమల లడ్డూ అనేది దేశమంతా ప్రసిద్ధి పొందిన పవిత్ర ప్రసాదం కాగా, దానిలో కల్తీ జరగడం భక్తుల మనసులను తీవ్రంగా కుదిపేసే అంశమని వారు అన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు బయటకు రావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వైసీపీ వర్గాలు ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా కొట్టిపారేస్తున్నాయి. తాము ఏ విధంగానూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయలేదని, సిట్ నివేదికను వక్రీకరిస్తున్నారని ప్రభుత్వ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. కాగా భక్తులు మాత్రం ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “శ్రీవారి లడ్డూలో కల్తీ అనే మాట వినడమే పాపం” అంటూ భక్తులు స్పందిస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించింది. తిరుమల పవిత్రతను కాపాడడం ప్రభుత్వ ధర్మమని, రాజకీయ ప్రయోజనాలకోసం దానిని లాగడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/