हिन्दी | Epaper

Bijapur: పాపను కారులో వదిలేసి దర్శనానికి వెళ్లిన తల్లితండ్రులు..ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

Anusha
Bijapur: పాపను కారులో వదిలేసి దర్శనానికి వెళ్లిన తల్లితండ్రులు..ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

కర్నాటకలోని బీజాపూర్‌ జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి తన భార్య,పాప, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మహానంది క్షేత్రానికి (Mahanandi Temple) దేవుడి దర్శనానికి వచ్చాడు. కుటుంబం అంతా నంది సర్కిల్ దగ్గర తమ కారును పార్క్ చేసి, ఆపై దర్శనానికి వెళ్లింది. ఈ క్రమంలో ఒక పసిపాప కారులోనే ఉండిపోయి ప్రాణాపాయం ఎదుర్కొన్న ఘటన స్థానికులను కలవరపరిచింది.వారు తమ కారును నంది సర్కిల్ దగ్గర పార్క్ చేశారు. పాప నిద్రపోతుండటంతో భర్త చూసుకుంటాడని భార్య అనుకుంది. భార్య చూసుకుంటుందని భర్త భావించారు. భర్త మూత్రవిసర్జనకు వెళ్లి పాపను భార్య తీసుకెళ్లిందని భావించాడు.. వేర్వేరుగా దర్శనానికి వెళ్లారు. పాప కారులోనే ఉండిపోయింది.

గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు

కారు అద్దాలన్నీ మూసి ఉన్నాయి.. తలుపులు కూడా లాక్ చేసి ఉన్నాయి. దీంతో చిన్నారికి ఊపిరాడటం లేదు. .చెమటలు పట్టి నిద్రలేచి ఏడుస్తోంది. కారులో చిన్నారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. దేవస్థానం సమాచార కేంద్రంలోని రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వర్, పొరుగుసేవల ఉద్యోగి నాగార్జునరెడ్డికి ఈ విషయం చెప్పారు. వారు వెంటనే కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ (Constable Chandrashekhar) కు సమాచారం ఇచ్చారు. చంద్రశేఖర్ వెంటనే స్పందించి రాయితో కారు అద్దాలు పగలగొట్టారు. ఆ చిన్నారిని బయటకు తీశారు.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పాపకు సమాచార కేంద్రంలో సపర్యలు చేయడంతో ప్రాణాపాయం నుంచి కాపాడారు. చిన్నారి కొద్దిసేపటికి కోలుకుంది.

పాప గురించి ప్రకటన చేశారు

ఆ తర్వాత ఆలయంలో మైకుల ద్వారా పాప గురించి ప్రకటన చేశారు. అనంతరం 15 నిమిషాల తర్వాత తల్లిదండ్రులు వచ్చి పాపను తీసుకువెళ్లారు.. వారిని పోలీసులు మందలించారు. చిన్నారిని కాపాడిన కానిస్టేబుల్ చంద్రశేఖర్‌కు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. కానిస్టేబుల్ చూపిన చొరవను హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. స్థానికులు పాపను గమనించబట్టి సరిపోయింది.. లేకపోతే పరిస్థితి ఏంటి. పాపం పాపను కారులోనే మర్చిపోయి తల్లిదండ్రులు దర్శనానికి వెళ్లడం విచిత్రంగా ఉందని స్థానికులు చర్చించుకున్నారు.. చిన్నారి సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read more: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/naveen-patnaik-naveen-patnaiks-health-is-very-critical/national/531853/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870