हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest Telugu news : Bihar Voter List : ప్రతిష్టాత్మక భేరి !

Sudha

బీహార్లో వైశాలి ప్రపంచానికి ప్రజాస్వామ్య మార్గాన్ని చూపినట్లే, ఈసారి బీహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళన దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నది ఎన్నికల కమిషన్ ఆకాంక్ష. అందుకేనే మో! ఇలా ప్రత్యేక ముమ్మర ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తవగానే బీహార్ ఎన్నికల నోటిఫికేషన్అలా ప్రకటించే సింది ప్రధాన ఎన్నికల కమిషన్. 22ఏళ్ల తర్వాత బీహార్ రాష్ట్రంలో ఇలాంటి ఓటర్ల జాబితా (Bihar Voter List) ప్రక్షాళన జరిగిందని సిఇసి ఎందుకలా గొప్పగా చెప్పుకుంటుందో అర్థంకాదు. ఇంతక్రితం అలాంటిదేమీ జరుగలేదని కాబోలు. కానీ ఏ స్థాయి ఎన్నికలైనా త్వరలో వస్తాయనగా లేదా ఏటా విస్తృత ఓటర్ల జాబితా సవరణ వంటి సవరణలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ బూటకమేనా! అలాంటి సవరణల్లో కనీసం కొత్త నవయువ ఓటర్ల చేర్పింపు, అదే సమయంలో నకిలీ ఓటర్ల గుర్తింపు, జాబితాల నుంచి ఓటర్ల బదలీ వంటివి సాధారణం. వీటన్నిటినీ మించి బీహార్ ఓటర్ల జాబితా సవరణ(Bihar Voter List) లేదా ప్రక్షాళన సంపూర్ణమైందంటే ఆహ్వానించదగిన పరిణామమే. అయినా ఎన్నడూ లేనిది ఓటర్ల జబితా తప్పొప్పుల విషయం మాత్రమే చర్చించే విపక్షాలు ఈసారి గొంతెత్తి అరిచాయి. వారి విమర్శలు చిరిగి చిరిగి కన్నం చాటయ్యిందన్న చందాన ఉన్నాయి. జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని సిఇసి సీరియస్ గా తీసుకుని క్షమాపణలు కోరిన పరిస్థితి వచ్చింది. చెప్పాలంటే సిఇసి తన బాధ్యతలను విస్మరించి వ్యక్తిగత స్థాయిలో విమర్శల్లోకి వెళ్లిపోవడాన్ని ఎవరూ సమర్థించలేదు. అన్ని అధికారాలు ఉన్నస్వతంత్ర సంస్థ ఎన్నికల కమిషన్. అలాంటి ఎంతో హుందాగా వ్యవహరించాల్సి ఉందని పలువురు బ్యూరోక్రట్స్ కూడా సూచించారు. అది సద్దుమణిగినా బీహార్ ఓటర్ల జాబితా విషయంలో ఎన్నికల కమిషన్ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. భారతీయులు కానివారు, మరణించినవారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, ఒకటి రెండు చోట్ల ఒకే వ్యక్తికి ఓటుంటే వారి ఓట్లను తొలగించారు. ఇవన్నీ వాస్తవంగా చేయగలిగి ఉంటే అంతకన్నా పెద్ద ప్రక్షాళన మరేదీ ఉండదు. ఎన్నికల కమిషన్ను అభినందించా ల్సిందే. ఎప్పుడూ ఏ ఎన్నికకూ లేనట్లు బీహార్ఎన్నికల పైనా శ్రద్ధ పెట్టడం అటుంచితే ఆగస్టులో ముసాయిదా ప్రచురణకు ముందే బీహార్ ఓటర్ల జాబితా (Bihar Voter List)లోంచి 65 లక్షల మంది పేర్లను తొలగించడం, ఎన్నో విమర్శలకు గురైనా సుప్రీంకోర్టు మార్గదర్శకత్వంలో మరికొన్ని జాగ్రత్త లతో నెల రోజులపాటు స్వీకరించిన క్లెయిమ్లు, అభ్యంత రాల స్వీకరణ ప్రక్రియతో మరో 3.66 లక్షల మంది పేర్లను తొలగించడంలో ఎన్నికల కమిషన్ విశేష శ్రమ తీసుకుందనే చెప్పాలి. ఇప్పటికీ ఓటర్లు వ్యక్తిగతంగా వారి వారి హక్కుల కోసం ఎన్నికల కమిషనర్ను సంప్రదించ వచ్చుననే వెసులుబాటును కూడా ఇచ్చింది. ఏది ఏమయి నా బీహార్ ఎన్నికలప్రక్రియకు ముందే ఎన్ని ఆరోపణలు న్నా వాటిని అంచెలంచెలుగా సర్దుబాటు చేసుకుని రావడం, అసాంతం కొత్త కొత్త విధానాలకు కమిషన్ శ్రీకారం చుట్టింది. గతం గతః బీహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళనలో అనుసరించిన పద్ధతులన్నీ ఇతర రాష్ట్రాలకు వర్తింప చేయ డంలో ఎన్నికల కమిషన్ ఔచిత్యాన్ని ప్రశంసించాల్సిందే. తగిన సమయంలో అన్ని రాష్ట్రాలకు ఇదేప్రక్రియ విస్తరిం చేందుకు కమిషన్ ముందుకువచ్చింది. 15రోజుల్లో ఓటర్లకు ఎపిక్ కార్డులను అందచేసేందుకు నడుం కట్టింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందే 17 నూతన సంస్కరణలకు అంకురార్పణ చేయడం విశేషం. ఈవిఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలను వినియోగిస్తారు. పార్టీ ఎన్ని కల గుర్తు కూడా రంగుల్లోనే. వందశాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్. ఇవన్నీ ఎన్నికల ప్రక్రియలో పారదర్శ కత పెంచేందుకేనని సిఇసి జ్ఞానేశ్ కుమార్ స్పష్టంచేశారు. ఈ ఎన్నికలు దేశానికే రోల్మెడల్ అవుతాయని విశ్వా సంతో ముందడుగు వేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ వల్ల అను మానాలకు తావుండదు. ఈ ప్రక్రియ మొత్తాన్ని సిసిటివి కెమెరాల్లో రికార్డుచేశారు. ఈవిఎం కౌంటింగ్ యూనిట్లలో ఓట్లులెక్కింపు జరిగినప్పుడు వివిప్యాట్ల వ్యత్యాసం గుర్తిం చదగినట్లుగా ఉంటే రీకౌంటింగ్కు ఆస్కారమిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత, పారదర్శకత కోసం తీసుకున్న చర్యలను ఎన్నికల కమిషన్ సభ్యులు ముగ్గు రూ దేశానికి తేటతెల్లం చేశారు. నవంబరు 22తో బీహార్ శాసనసభ సభాకాలం ముగుస్తుంది. ఆలోగానే బీహార్ ఎన్నికలు పూర్తి చేసే తలంపుతో నవంబరు 6, 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరుగుతుందని ఇసి ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ జారీచేసింది. అయినా సుప్రీంకోర్టు కూడా బీహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. దేశమంతటా ఇదే తరహాలో వాస్తవ ఓటర్ల జాబితా కోసం చేపట్టాలనుకున్న ప్రక్రియను పరిశీలించాల నుకుంటోంది. ఆ నేపథ్యంలోనే బీహార్ తుదిఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల పేర్లు, వివరాలతో అంద చేయాలని సుప్రీం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిం ది. ఎలక్టోరల్ జాబితాలు పటిష్టంగా ఉంటే ఎన్నికలుఎంత సజావుగా నిర్వహించవచ్చునో బీహార్ఎన్నికల ద్వారానే దేశానికి వెల్లడించేందుకు ఇసి నడుం కట్టడం అభిలషించ దగినదే. ఇప్పుడు బీహార్ ప్రతిష్టాకర అంకంలోకి అడుగు పెడుతోంది. ఎన్డీఎ కూటమి అండతో ప్రస్తుత ముఖ్య మంత్రి నితీష్ కుమార్, మూడోసారి రంగంలోకి దిగుతుం డగా, లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి నేతృ త్వంలో విపక్ష కూటమి కూడా పోటీకి ఉరుకులు పరుగు లు తీస్తోంది. వీటన్నిటిని మించి ఎన్నో ఎన్నికల్లో ప్రధాన పార్టీల
విజయానికి ప్రభావితం చేసిన ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంతి కిషోర్ ‘జనసురాజ్’ కూడా పకడ్బందీ వ్యూహంతో ముందుకు కదులుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870