TDP : స్థానిక సంస్థల ఎన్నికల వేళ తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీలో తీవ్ర రాజకీయం వేడెక్కింది. టీడీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APUFIDC) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వూక విజయ్ కుమార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను జేబీ శ్రీనివాస్‌కు అప్పగిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన, తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు పంపారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే తాను తీవ్ర మనస్తాపానికి గురై పార్టీ వీడాల్సి వస్తోందని ఆయన వ్యక్తిగత కారణాలను చూపుతూ లేఖలో పేర్కొన్నారు.
Read ALso : నెల్లూరులో విషాద ఘటన.. వేడి సాంబార్‌లో పడి 12 మందికి తీవ్ర గాయాలు
కూటమి రాజకీయాల్లో ఊహాగానాలు: తదుపరి అడుగు ఎటు?
స్థానిక సంస్థల సమరానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ కీలక పరిణామం తిరుపతి కూటమి రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయం ప్రారంభించి, అనంతరం టీడీపీలో సుదీర్ఘకాలం పాటు బలిజ సామాజిక వర్గ ప్రతినిధిగా గుర్తింపు పొందిన ఆయన రాజీనామా చేయడంతో స్థానిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఆయన కూటమిలోని మిత్రపక్షాలైన జనసేన లేదా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కీలక ఎన్నికల సమయంలో స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలు, ఇన్‌ఛార్జ్ పదవుల కేటాయింపు వివాదాలు రచ్చకెక్కడం టీడీపీకి పెద్ద షాక్‌గానే పరిగణించవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :