ఇంటర్నేషనల్ కార్డ్ డీల్ నెట్వర్క్ పశ్చిమ గోదావరి పోలీసుల దాడి
భీమవరం : సైబర్ క్రైమ్ లో డిజిటల్ (Bhimavaram Crime) అరెస్ట్ పేరుతో వాట్సప్ కాల్ లో(WhatsApp) బెదిరించి భీమవరంలో పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ నుండి సుమారు 78 .6లక్షల రూపాయలు చోరీ చేసిన కేసులో ఇంటర్నేషనల్ కార్డు డీల్ నెట్వర్క్ పై పశ్చిమగోదావరి పోలీసులు దాడి చేసి సుమారు 80 సొమ్మును తిరిగి వసూలు చేశారు. గురువారం ఆనంద ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వివరాలు వెల్లడించారు. నవంబర్ 17వ తేదీన భీమవరంలో బాధిత వ్యక్తిని వివిధ కేసుల్లో మిమ్మలను డిజిటల్ అరెస్టు చేస్తున్నామని అరెస్టు చేయకుండా ఉండాలంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలు చెప్పడంతో పాటు డబ్బులు ఇవ్వాలని సైబర్ క్రైమ్ కు చెందిన నేరస్తులు బాధితున్ని బెదిరించి 78.6 లక్షలు అతని ఖాతా ఉన్న బ్యాంకుల నుండి చోరీ చేశారన్నారు అయితే చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు భీమవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. దీనికి సంబంధించి నేరస్తులు దేశంలోని ఇంటర్నల్ నెట్వర్క్ తో కలిసి బాధితుని డబ్బును నియంత్రిత బ్యాంకు ఖాతాలకు రహస్యంగా మళ్ళించడానికి కార్డు డీల్ (స్కామర్ల స్కామ్) పద్ధతిని ఉపయోగించారన్నారు.
Read also: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. గ్రీన్ కార్డ్ వారిపై ఫోకస్

వివిధ రాష్ట్రాల ముద్దాయిలను భీమవరం పోలీస్ టీమ్ అరెస్ట్ చేసింది
భీమవరం(Bhimavaram Crime) టూ టౌన్ సిఐ జి కాళీ చరణ్ బృందం భీమవరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు ఆకివీడు సీఐ వి. జగదీశ్వర్ రావు, ఎస్సైలు రెహమాన్, హెచ్ నాగార్జున ఎం. రవివర్మ ఎన్ శ్రీనివాసరావు కేఎం. వంశీ తదితర సిబ్బందితో కలిసి కేసును చేదించి వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని విజయవాడ సమీపంలో మరియు గన్నవరంలో 13మంది ముద్దాయిలను అరెస్టు చేశారన్నారు. ముంబై కు చెందిన రహతే జె నయన్ ను అరెస్టు చేయవలసి ఉందన్నారు అతను పరారీలో ఉన్నాడన్నారు. ఈ మొత్తం ఆపరేషన్లో ఆంధ్రప్రదేశ్ డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు తమకు మార్గదర్శకం చేశారన్నారు. సమావేశంలో భీమవరం డిఎస్పి రావూరి గణేష్ జై సూర్య. నర్సాపురం డిఎస్పి డాక్టర్ శ్రీ వేద పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: