ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా, ఉపాధి, ఉద్యోగాలలో ఇవ్వదలచిన 42 శాతం రిజర్వేషన్లను బీసీ వ్యతిరేకులు కోర్టు ద్వారా అడ్డుకున్నారు. రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్డ్లో చేర్చితే తప్ప ఈ రిజర్వేషన్లకు (BC Reservations) రక్షణ ఉండదు. 56 శాతం పైగా ఉన్న బీసీలకు 60 శాతం రిజర్వేషన్ (BC Reservations) కల్పించినప్పుడే సమన్యాయం జరుగుతుంది. ఎందుకంటే 8 శాతంగా ఉన్న సామాజిక ఉన్నత వర్గాల వారికి 10 శాతం ఇచ్చారు కాబట్టి. జనాభా దామాషా ప్రకారం వారి వారి జనాభాలకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పిస్తే సమాజంలో అందరికీ సమన్యా యం జరిగినట్లే. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ మేము బీసీలకు స్థానిక సంస్థలలో 42శాతం సీట్లు ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అన్ని రాజకీయపార్టీలు నిజంగా బీసీలకు న్యాయం చేయాలంటే అందరూ కలిసి పార్లమెంటులో చట్ట సవరణ చేసి చట్ట సభలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ అది నాయకుడు తెలంగాణలో స్థానిక సంస్థలలో బీసీలకు కల్పిస్తామన్న 42 శాతం రిజర్వేషన్లను హైకోర్టు నిలిపి వేసి నప్పుడు ఎందుకు పార్లమెంటులో ప్రస్తావించలేదు. దీనిని బీసీలు గమనించాలి. స్వతంత్ర భారతదేశ సామాజిక రాజకీయ ఆర్థిక పురోగాభివృద్ధిని పరిశీలిస్తే న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే నాలుగు స్తంభాలు భారత రాజ్యాంగానికి మూలాధారం. అధికరణ 14,16 ప్రకారం ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు కల్పించాలని భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది. దేశ శాసన, కార్యనిర్వా హక, న్యాయ వ్యవస్థలను పరిశీలిస్తే సమానత్వం బోధించే ఏ వ్యవస్థలో కూడా సమానత్వం మచ్చుకైన కనిపించదు.
Read Also : http://Randhir Jaiswal: అయోధ్యపై పాక్ విమర్శలకు భారత్ కౌంటర్

ఉన్నత వర్గాల చేతుల్లోకి
నేటి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లను తెచ్చి సమస్త వ్యవస్థలను సామాజిక ఉన్నత వర్గాల చేతుల్లోకి తీసుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందు కంటే నేటివరకు ఉత్పత్తి కులాలకు ఉపాధి కరువవడం, ఆ ఉత్పత్తి వ్యవస్థలు ఉత్పత్తులు అన్నీ బడుగు బలహీన వర్గాలకు అందకుండా కొందరి చేతుల్లో గుత్తాధిపత్యానికి గురవుతున్నాయి. వివిధ రాష్ట్రాలలో కొన్ని కులాలు రాష్ట్ర బీసీ జాబితాలో ఉన్న కేంద్ర ఓబీసీ జాబితాలో మాత్రం లేవు అంటే వీరికి కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు. అన్ని రాష్ట్రాలలో కలిపి సుమారుగా 3150 బీసీ కులాలు ఉంటే కేంద్ర జాబితాలో 2479 కులా లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కేంద్రం లెక్కల ప్రకారం ఓబీసీలు 52 శాతం కానీ రాష్ట్రాల లెక్కల ప్రకారం బీసీలు 56శాతం. దీనంతటి కారణం కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడంగా భావించవచ్చు. రాజ్యమేలుతున్నది ఉన్నత సామాజిక వర్గం కాబట్టి జనగణన చేయకుండానే 8 శాతం ఉన్న ఉన్నత సామాజిక వర్గాలవారికి 10శాతం రిజ ర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లి వీకర్సెక్షన్స్) పేరు మీదుగా కేంద్రం ప్రత్యేకంగా 103వ రాజ్యాంగ సవరణ చేసి కల్పించారు. దేశ జనాభాలో 56శాతంకి పైగా ఉన్న బీసీలకు కేవలం 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు దక్కడం ఎంత అన్యాయం. బీసీలు రిజర్వేషన్లు పెంచమని అడిగితే ప్రతిభ పాడైపోతుందని మొత్తుకున్నారు. కానీ ఉన్నత సామా జిక వర్గాల వారి విషయానికొస్తే వారు రిజర్వేషన్ల కింద లబ్ధిపొందిన ప్రతిభ పాడుకాదు. ఇక ఉన్నత న్యాయస్థానా లలో ఉన్నది వారే కాబట్టి రిజర్వేషన్లు 50 దాటరాదని తీర్పునిచ్చుకున్నారు. ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల విషయానికి వస్తే మాత్రం ఏ న్యాయ పరిమితులు వర్తించవు. అందుకే ఉన్నత న్యాయస్థానాలలో కొలీజియం వ్యవస్థను ఎత్తివేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది. లేనియెడల ఉన్నత న్యాయస్థానా లలో బీసీల ప్రాతినిధ్యం శూన్యం.
అలుపెరగని పోరాటం
ఈడబ్ల్యూఎస్ పొందడానికి వర్తించే అర్హతలను పరిశీలిస్తే కుటుంబ ఆదా యం 8లక్షల లోపు ఉండాలి( అది ఎనిమిది లక్షల ఆదా యం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం ఆదాయపు పన్ను కట్టాల్సిందే), 5 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉండవచ్చు. నివాస స్థలం మున్సి పాలిటీలలో 1000 అడుగుల వరకు ఉండవచ్చు, మునిసి పాలిటీ బయట ఉన్న నివాస స్థలం 200 గజాల వరకు ఉండవచ్చు. ఆస్తి పరిమితులు రాష్ట్రాలను బట్టి మారవచ్చు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ కోటా కింద రిజర్వేషన్ సదుపాయాలు పొందడానికి వీలు లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చినా విద్యా, ఉద్యోగాలలో ఉన్నత సామాజిక వర్గాల వారికి మాత్రం ప్రాతినిధ్యం దక్కుతూనే ఉన్నది. పుడమిపైనున్న సమస్త సిరిసంపదలను సృష్టిస్తూ 80-90శాతం పైగా ఉన్న సబ్బండ వర్గాలకు సంబంధించిన అన్ని కులా లకు లేదా ఏకులానికి సరియైన కనీస ప్రాతినిధ్యం ఏ వ్యవస్థలో కూడాలేదు. అన్నీ ఉన్నత సామాజికవర్గాల చేతుల్లోనే బంధించబడ్డాయి. ఆర్థిక, ఉద్యోగ ఉపాధి, రాజకీయ, పారిశ్రామిక, సేవా లాంటి రంగాలు పూర్తిగా వారిగుప్పిట ఉన్నాయి. బీసీలకు తాత్కాలికంగా గొర్రెలు, బర్రెలు, చేపలు, పని ముట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఫలితంగా బీసీల ప్రశ్నించే తత్వానికి పాతరేస్తున్నారు. ఎట్టి కష్టం ఎంత చేసినా వేసారి పోవడమే తప్ప ఒరిగిందేమీ లేదు. బీసీ నాయకులు, మేధావులు రాజ్యాధికారమే పరమా వధిగా పనిచేసినప్పుడు కొండంత బీసీ బలగం అండగా నిలుస్తూ బీసీ వ్యతిరేకులు సృష్టించే గండాల సుడిగుండాల నుండి దాటిస్తారు. లభ్యమవుతున్న సమాచారం మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2014 వరకు శాసన సభకు జరిగిన ఎన్నికల్లో సుమారు 1375 మంది ఎమ్మెల్యే లు అయితే అందులో రెడ్లు 658, కమ్మలు 549 కానీ రాష్ట్ర జనాభాలో బీసీలు 56 శాతంగా ఉండి 139కులాలు కలిగి కేవలం 498 మంది మాత్రమే! హైదరాబాద్ రాష్ట్రం, ప్రత్యేక ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బీసీని ముఖ్యమంత్రి కానివ్వలేదు. శాసనమండలి సభ్యుల, లోక్సభ సభ్యుల, రాజ్య సభ సభ్యుల విషయంలో బీసీల పరిస్థితి ఇంకా దారుణం. అందుకే బీసీలు మేలుకొని తమ హక్కులకై ఐకమత్యంగా అలుపెరగని పోరాటం చేయాలి.
– డా. కావలి చెన్నయ్య
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: