
AP: బాపట్ల జిల్లా నిజాంపట్నం(Nizampatnam) హార్బర్ పరిధిలో చేపల వేట బోటులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం (Bapatla Fire Accident) చోటుచేసుకుంది. జెట్టీ వద్ద నిలిపి ఉంచిన మత్స్యకారుల బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు.
Read also: Maoist: తెలంగాణ డీజీపీ ఎదుట నేడు లొంగిపోనున్న బరిసె దేవా
మత్స్యకారులు సురక్షితం..
మంటలు వ్యాపిస్తున్న వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు బోటులో నుంచి సురక్షితంగా కిందికి దిగిపోయారు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బోటు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినా, బోటు పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఘటనలో దాదాపు రూ.20 లక్షల వరకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: