ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధానిగా అమరావతిలో కీలక ప్రగతి దశకు చేరింది. శుక్రవారం, అమరావతిలో 15 ప్రముఖ ప్రభుత్వ(Banks) రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం రాజధానిని ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా సృజించేందుకు ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, పయ్యావుల కేశవ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ 15 బ్యాంకులు, బీమా సంస్థల ఏర్పాటుతో రాజధానికి భారీ పెట్టుబడులు చేరనున్నాయి. దీంతో అనేక ఉపాధి అవకాశాలు సృష్టించబడనున్నాయి.
Read also: ఆధ్యాత్మికతకు మార్గం, ఆరోగ్యానికి మేలు

శంకుస్థాపన జరిగిన సంస్థలు, పెట్టుబడులు, ఉద్యోగాల వివరాలు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‍బీఐ): పెట్టుబడి – రూ.300 కోట్లు | ఉద్యోగాలు – 2000
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: పెట్టుబడి – రూ.50 కోట్లు | ఉద్యోగాలు – 160
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు: పెట్టుబడి – రూ.256 కోట్లు | ఉద్యోగాలు – 1000
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: పెట్టుబడి – రూ.40 కోట్లు | ఉద్యోగాలు – 300
- ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్): పెట్టుబడి – రూ.200 కోట్లు | ఉద్యోగాలు – 400
- బ్యాంక్ ఆఫ్ ఇండియా: పెట్టుబడి – రూ.40 కోట్లు | ఉద్యోగాలు – 200
- కెనరా బ్యాంక్: పెట్టుబడి – రూ.50 కోట్లు | ఉద్యోగాలు – 300
- బ్యాంక్ ఆఫ్ బరోడా: పెట్టుబడి – రూ.60 కోట్లు | ఉద్యోగాలు – 300
- ఇండియన్ బ్యాంక్: పెట్టుబడి – రూ.40 కోట్లు | ఉద్యోగాలు – 105
- నాబార్డ్: పెట్టుబడి – రూ.90 కోట్లు | ఉద్యోగాలు – 160
- పంజాబ్ నేషనల్ బ్యాంక్: పెట్టుబడి – రూ.15 కోట్లు | ఉద్యోగాలు – 150
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: పెట్టుబడి – రూ.4 కోట్లు | ఉద్యోగాలు – 65
- ఐడీబీఐ బ్యాంక్: పెట్టుబడి – రూ.50 కోట్లు | ఉద్యోగాలు – 215
- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ): పెట్టుబడి – రూ.22 కోట్లు | ఉద్యోగాలు – 1036
- న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ: పెట్టుబడి – రూ.93 కోట్లు | ఉద్యోగాలు – 150

ఈ 15 జాతీయ స్థాయి ఆర్థిక సంస్థల(Banks) ప్రధాన కార్యాలయాల శంకుస్థాపనతో, అమరావతి రాజధాని అభివృద్ధి చెందేందుకు మరింత దశాబ్దాల పాటు అంగీకృత పెట్టుబడులు, అధిక స్థాయిలో ఉద్యోగ అవకాశాలు సాధ్యం అవుతాయని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: