హైదరాబాద్ : గోదావరి నది యాజమాన్య బోర్డు మెంబర్ సెక్రటరీ అళగేశన్ రంగస్వామిని ఎట్టకేలకు టెక్నికల్ మెంబర్గా డిమోట్ చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అళగేశన్ రంగస్వామి (Alageshan Rangaswamy) పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా ఆయనను కేంద్రజలశక్తి మంత్రిత్వ శాఖ కానీ, సిడబ్ల్యుసి కానీ తొలగించడానికి ససేమిరా అన్నది. అళగేశన్ జిఆర్ ఎంబిలో పనిచేసే మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా వారిని అనేక విధాలుగా హింసిస్తున్నారని ఆరోపణలు కూడా వెళ్ళువెత్తినా కేంద్ర జలశక్తి శాఖ పెద్దగా స్పందించలేదు. అళగేశన్ అదే దోరణితో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించడంతో ఆయన పై చర్యలు తీసుకోవడానికి కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖ ముందుకు వచ్చింది. ఫిర్యాదు చేసినా కేంద్ర లెక్కచేయని ప్రభుత్వం తన రాజకీయ భాగస్వామి చంద్రబాబు నిర్మించే ప్రాజెక్టుపై లేఖాస్త్రం సందించడాన్ని జీర్ణించుకోలేకపోయింది.
ఉద్యోగం నుంచి తొలగించాలని కేంద్ర జలశక్తిని డిమాండ్ చేసింది
బనకచర్ల నిర్మాణం కారణంగా తలెత్తే ప్రకృతి అసమతుల్యత, పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాలు అన్ని మారిపోతాయని, కాబట్టి మళ్లీ అన్ని రాష్ట్రాల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అళగేశన్ లేఖలో ప్రస్తావించడం ఆయన పైచర్య తీసుకోవడానికి కారణమైంది. అదేవిధంగా బనకచర్లకు అనుమతులను వెంటనే నిలిపివేయాలని కేంద్రానికి కూడా వ్యక్తిగతంగా ఓ లేఖ రాశారు. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) ను అళగేశన్ రంగస్వామి వ్యతిరేకిస్తున్నారని, అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని కేంద్ర జలశక్తిని డిమాండ్ చేసింది. అయితే, పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తే తాము అవినీతి, లైంగిక ఆరోపణలు వెల్లువెత్తినా గతంలో ఆయనకు బాసటగా కేంద్ర జలశక్తి తీవ్ర విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుందని జిఆర్ఎంబి మెంబర్ సెక్రటరీ స్థాయి నుంచి అళగేశన్ రంగస్వామిని టెక్నికల్ మెంబర్ డిమోట్ చేస్తూ కేంద్ర జలశక్తి ఉత్తర్వులు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే
అళగేశన్ రంగస్వామి స్థానంలో ఆర్ కె కనోడియాను సెక్రటరీగా నియమించారు. ప్రస్తుతం జిఆర్ఎంబి మెంబర్గా ఆయన ఉన్నారు. గోదావరినది (Godavari River) నీళ్ళను పెన్నా బేసిన్ కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే వివాదంగా మారింది. కేంద్రప్రభుత్వం బుధవారం ఇరు ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తేనే తెలంగాణ బనకచర్ల అంశం ఎజెండాలో ఉంటే తాము సమావేశంకు హాజరుకామని ఎజెండాను మార్పుచేయించింది.
గోదావరి నది జన్మస్థలం ఏది?
గోదావరి నది భారత దేశం లో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజమబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణ లోకి ప్రవేశిస్తుంది.
గోదావరి నది పొడవు ఎంత?
గోదావరి నది పొడవు 1,465 కిలోమీటర్లు. ఇది భారతదేశంలో గంగా నది తర్వాత రెండవ పొడవైన నది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: PCC Chief Mahesh Kumar Goud: బనకచర్ల ప్రాజెక్టును ప్రోత్సహించింది కెసిఆర్