ఏపీ సిఎం చంద్రబాబుకు శశిధర్రెడ్డి లేఖ
హైదరాబాద్ : బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఉపయోగం కంటే అధిక ఖర్చు అవుతుందని, చివరికి తెల్ల ఏనుగుగా మారుతుందని డాక్టర్ ఎం. చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ, మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి చెప్పారు. దీనికి బదులుగా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన ‘నీరు-మీరు’ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు చంద్రబాబునాయుడుకు తాను లేఖ రాయడం జరిగిందని, అవకాశం ఇస్తే అన్ని అమరావతిలో కలిసి చర్చిస్తానని చెప్పారు.
అమలు చేయాలని సిఫార్సు చేయడం జరిగిందని
గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ 2001లో దివంగత హనుమంత రావు అధ్యక్షతన ఒక సాంకేతిక కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేయడం జరిగిందని ఫోర్ వాటర్ కాన్సెప్ట్ (ఎఫ్ డబ్ల్యూసి) ఆధారంగా వాటర్ షెడ్ ప్రాజెక్టులను అమలు చేయాలని సిఫార్సు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ-రాయల సీమలో 84-120 గ్రామాలను కవర్ చేయడం జరిగిందని, అద్భుతమైన ఫలితాలను గుర్తించలేక పోయిన జహిరాబాద్ (Zahirabad) సమీపంలోని కోహిర్ మండలం, గొట్టిగారివల్లి గ్రామం విజయం సాధించి, మీడియా దృష్టిని ఆకర్షించిందన్నారు. నాడు ఎకరానికి 5 వేలు రూపాయలు ఖర్చు చేస్తే, ఒక ఏడాదిలో మూడు పంటలకు నీరు లభించేదని, అయితే తెలుగు రాష్ట్రాలు ఎఫ్ డబ్ల్యూసిని పూర్తిగా విస్మరించబడాయన్నారు.

ప్రాజెక్టును ప్రక్కన బెట్టి దానికి అయ్యే ఖర్చులో
గతంలో ప్రధాన నరేంద్రమోదీ 2017లో మన్ కి బాత్ ఎపిసోడ్ కార్యక్రమంలో ఈ కార్యక్రమం విజయం గురించి ప్రస్తావన చేయడం జరిగిందని శశిధర్రెడ్డి వివరించారు. ఎఫ్ డబ్ల్యూసి వల్ల ఆనేక ప్రయోజనాలు ఉన్నాయని, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపి శాశ్వితంగా కరువు నివారణ కోసం ఫోర్ వాటర్ కాన్సెప్ట్ను ఎంపిక చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చంద్రబాబునాయుడు బనకచర్ల ప్రాజెక్టును ప్రక్కన బెట్టి దానికి అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని ఎఫ్ డబ్ల్యూసీకి అమలుపై మీడియాతో మాట్లాడుతున్న మాజీమంత్రి మర్రి శశిధర్రెడ్డి చేయాలని, దీంతో ఏడాదికి మూడు పంటలకు నీరు అందించి మూడు రెట్లు ప్రయోజనం పొందే అవకాశం ఉందని, అలా చేస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. నా శేష జీవితాన్ని హనుమంతరావు, ఎఫ్ డబ్ల్యూసికి అంకితం చేస్తున్నానని, ఎఫ్ డబ్ల్యూసి మనదేశానికి గోప్పవరమని, జాతీయ స్థాయిలో విధాన మార్పులు అవసరమని, ఎపి ప్రభుత్వం నాయకత్వం వహించగలదని అశిస్తున్నట్లు చెప్పారు.
మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఎవరు?
మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో మాజీమంత్రి గా పనిచేశారు.
మర్రి శశిధర్ రెడ్డి ఏ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు?
ఆయన విపత్తు నిర్వహణ, వరద నియంత్రణ, వ్యవసాయ విధానాలపై కృషి చేసి గుర్తింపు పొందారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also :