ఆంధ్రప్రదేశ్(AP) ముఖ్యమంత్రి కార్యదర్శి కె. విజయానంద్(K. Vijayanand) పదవీకాలం మరో మూడు నెలల వరకు పొడిగించబడింది. ఈ నెలాఖరుకి ముగియాల్సిన ఆయన పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు కేంద్రం ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: AP pension scheme: కొత్త పెన్షన్ల మంజూరు, డిసెంబర్ 1 నుండి పంపిణీ ప్రారంభం

విజయానంద్ 2024 డిసెంబరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 14 సంవత్సరాల ఎనర్జీ రంగ అనుభవం ఉన్న ఆయన, ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024(Integrated Clean Energy Policy 2024)’ రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పాలసీ రాష్ట్రాన్ని 160 GW రెన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా మార్చే లక్ష్యాన్ని పెట్టుకుంది. అలాగే, తుఫానుల సమయంలో ఎనర్జీ సరఫరాను నిర్వహించడంలో ఆయన తీరుకు ప్రశంసలు అందుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: