ఆత్మకూరు (నెల్లూరు) : ఆత్మకూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖాల ద్వారా సుమారు 144.5కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆత్మకూరు మండలంలోని వాసిలి గ్రామంలో జాతీయ రహదారి నుంచి వాసిలి గ్రామం వరకు సుమారు 49లక్షల రూపాయలతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా నిర్మించనున్న సిసిరోడ్లకు మంత్రి ఆనం శంఖు స్థాపన చేశారు. అనంతరం పూర్తయిన రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలజీవన్ మిషన్ ద్వారా ఆత్మకూరు మండలంలో 19కోట్ల రూపాయలతో 76పనులను ప్రారంభించామన్నారు. కొన్ని టెండరు ప్రక్రియ సాగుతుందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో 336 పనులకు 65కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
Read also: YCP : జగన్ అంతా తెలుసు అనుకుంటారు – లోకేశ్

Anam Ramanarayana Reddy
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందజేస్తుందన్నారు
రాష్ట్రంలో 1.4కోట్ల రూపాయల నిధుల కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 5లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మరమ్మత్తులు చేయడం జరుగుతుందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా చివరి ఆయకట్టు భూములు కూడా వ్యవసాయ ఆమోదయోగ్యం పొందడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో అనేక లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నిధులు మంజూరు చేశారన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవసాయంలో అంతర్భాగమన్నారు. మరికొన్ని నూతన పథకాలను కూడా ప్రారంభిస్తామన్నారు. ఎన్డీఎ చేసిన వాగ్దానాల మేరకు అభివృద్ధి పనులు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందజేస్తుందన్నారు. ఈనెల 31వ తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు. ఇంటింటికి మూడు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.
అదనంగా నూతన గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని, అదనంగా నూతన గ్యాస్ కనెక్షన్ 200 ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. నియోజకవర్గ పరిధిలో 761 పనులకు 50కోట్ల 72లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు నియోజకవర్గ ప్రజల శ్రీకారం చుట్టి పనులు పురోగతి లో ఉన్నాయన్నారు. 9బిటి రోడ్లు 47కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసేందుకు 26.9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. వాసిలి ఎస్సీ కాలనీలో 69.3లక్షల రూపాయలతో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మండల పరిధిలో జలజీవన్ మిషన్ కింద 76.19కోట్ల రూపాయలతో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని నియోజకవర్గ పరిధిలో 336 పనులకు 6588 లక్షల రూపాయలతో శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి బి. పావని, మండల రెవెన్యూ అధికారి పద్మజ, మండల అభివృద్ధి అధికారి, వంచాయతీరాజ్ శాఖ అధికారులు, స్థానిక అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: