Assembly : వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబరు (September) 18 నుంచి ప్రారంభం కానున్నాయని ఏపీ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆ మేరకు స్పీకరు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలయింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్పాయింట్ ప్రజెం టేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే తాజా రాజకీయ పరిణా మాలు, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేకంగా చర్చించేయోచన. ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా.. పాలనపై సమగ్రంగా చర్చ జరగనుంది. 14, 15 తేదీల్లో తిరుపతిలో మహిళా పార్లమెంటేరియన్ సమావేశం (Women Parliamentarians’ Conference) జరగనుందని, దేశంలోని అన్ని రాష్ట్రాల మహిళా శాసన సభ్యులు సహా సుమారు 300 మంది హాజరు కానున్నారని తెలిపారు.
ఈ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇతర విషయాలపైనా మాట్లాడారు. మహిళా పార్లమెంటేరియన్ సమావేశాన్ని 145 లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. 15న ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరవుతారని చెప్పారు. ఇక 10 రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్నీ గత నెలలలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
మహిళా పార్లమెంటేరియన్ సమావేశం ఎప్పుడు జరుగుతుంది?
మహిళా పార్లమెంటేరియన్ సమావేశం సెప్టెంబర్ 14, 15 తేదీల్లో తిరుపతిలో జరుగుతుంది. ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది మహిళా శాసన సభ్యులు పాల్గొంటారు.
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి?
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమై సుమారు 10 రోజులపాటు కొనసాగనున్నాయి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :