Undavalli Arun Kumar reacts to Pawan Kalyan: ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై తన అంచనాలు చెదిరిపోయాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్(Arun Kumar) వ్యాఖ్యానించారు. పవన్ ముఖ్యమంత్రి అవుతారని నమ్మిన తానిక, ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్రంగా నిరుత్సాహపరిచాయని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ చేసిన “కోనసీమకు తెలంగాణ దృష్టి పడింది” అనే వ్యాఖ్యలు పూర్తిగా తగవని, బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
Read Also: Ramanarayana Reddy: పాలు లేకుండా నెయ్యి తయారీ?

రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి… డిప్యూటీ సీఎం వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎప్పటికీ సమంజసం కాదన్నారు.
పవన్‌పై ఉన్న తన వ్యక్తిగత గౌరవం, నమ్మకం ఇలాంటి వ్యాఖ్యలతో దెబ్బతిన్నట్లు చెప్పారు.
చంద్రబాబు నిర్ణయాలపై కూడా ఉండవల్లి ప్రశ్నలు
అలాగే సీఎం చంద్రబాబు(CM Chandrababu)పైనా ఉండవల్లి ప్రశ్నలు లేవనెత్తారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో ప్రపంచం ముందుంచుతున్న చంద్రబాబు… తన స్వంత వ్యాపారాలు, నివాసం మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు మార్చకపోవడం వెనుక కారణమెంతని ఆయన ప్రశ్నించారు.
టిడిపి–జనసేన–బీజేపీ
టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పూర్తిగా వైసీపీని ఓడించాలనే ఉద్దేశ్యంతోనే ఏర్పడిందని, అందుకే విజయాన్ని సాధించగలిగిందని ఉండవల్లి విశ్లేషించారు. ఈ పొత్తు ఎంతకాలం నిలదొక్కుకుంటుందో గమనించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: