
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బాధితురాలు వీణ శనివారం పోలీసు విచారణకు హాజరయ్యారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఈ విచారణను చేపడుతున్నారు.
Read Also: Guarantees : కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం
జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం
తమపై జరుగుతున్న అన్యాయంపై బాధితురాలు వీణ గతంలో జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కమిషన్, తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే పిటిషనర్‌గా వీణ రాజంపేట ఏఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేస్తున్నారు. విచారణ అనంతరం ఏఎస్పీ ఈ వివరాలను నేరుగా జాతీయ ఎస్సీ కమిషన్‌కు నివేదించనున్నారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: