విజయవాడ Aqua : రాష్ట్రంలో ఆక్వా రంగానికి (Aqua sector) అన్ని విధాల అండగా నిలుస్తామని, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్, వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఆక్వా కల్చర్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ఆక్వా ఎగుమతి దారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, రైతులు, ఫీడ్ కంపెనీ, హేచరీస్ యజమానులు, అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేలాది మంది ఆక్వారంగంపై ఆధారపడి ఉన్నారు.
ఆక్వా రంగంపై సుంకాల ప్రభావం – సంక్షోభాన్ని అవకాశంగా మలిద్దాం
ఈ రంగం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఆక్వా ఎగుమతులపై అమెరికా 25 శాతం సుంకాలను విధించింది. మరో 25 శాతం సుంకాలు పెంచే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆక్వా ఇండస్ట్రీ కలిసి సమస్యల పరిష్కారం కోసం కృషిచేద్దాం. ఇటీవల ఢిల్లీ పర్యటనలోనూ ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర పెద్దలకు వివరించడం జరిగింది.

రష్యా, యూరోపియన్ యూనియన్ మార్కెట్ (European Union market) పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తి వ్యయం తగ్గించడంతో పాటు పవర్ టారిఫ్ లపైనాచర్చించాల్సిన అవసరం ఉంది. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుందామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టిసారించారని అన్నారు. వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కేవలం విదేశీ ఎగుమతులపైనే ఆధారపడకుండా దేశీయంగా రొయ్య వినియోగం పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల మార్కెట్ పైనా దృష్టిసారించాల్సిన అవసరమన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :