మహిళలకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వాలు ఎందుకు ఇస్తున్నాయో తెలియదు కానీ, సీట్ల కోసం సిగపాట్లు ఎక్కువ,అవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి పథకంగా ఫ్రీ బస్సును ‘మహాలక్ష్మి’ (‘Mahalakshmi’) ని అమలు చేసినప్పుడు మహిళలు ప్రవాహంలా బస్సుల్లో ప్రయాణించేవారు. దీంతో సీట్ల కోసం జట్లుపట్టుకుని కొట్టున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఫ్రీ బస్సుల సౌకర్యాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది.
తెలంగాణలో జరిగినట్లే ఆంధ్రాలోనూ మొదలైన డిష్యుం.. డిష్యుం
తెలంగాణలో ఇప్పుడిప్పుడు మహిళల ప్రయాణీకుల సంఖ్య కాస్త తగ్గింది. డీలక్స్ బస్సు (Deluxe bus) ల సదుపాయం పెట్టడంతో ఉద్యోగం చేసే మహిళలు, డబ్బున్న వారు అందులో ప్రయాణిస్తుండడం వల్ల కాస్త తగ్గింది. అయితే ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఈ పథకం ఇటీవలే రావడంతో మహిళలు పోలోమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇంకేముంది బస్సులు తక్కువ ప్రయాణీకులు ఎక్కువ. సీట్లకోసం సిగపాట్లు కొనసాగుతున్నాయి.
ఆమధ్య సీటు కోసం ఓ మహిళ ఓ పెద్దాయనను బండబూతులు తిట్టి.. చివరికి సీట్లో నుంచి లేపేసింది. ఆ వీడియో బాగా వైరల్ అయింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) టెక్కిలి నుంచి దిమ్మిడిజోల గ్రామానికి వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో సీటు కోసం ఓమహిళ, యువకుడి మధ్య గొడవ జరిగింది. ఇంకేమీ ఉంది ఇద్దరు జుట్టుపట్టుకుని డిష్యుం.. డిష్యుం అంటూ ఫైటింగ్ కు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై మీరు ఓ లుక్ వేయండి..

Read hindi news: hindi.vaartha.com
Read also: