APSRTC ప్రయాణీకుల కోసం కొత్త టికెట్ బుకింగ్ సౌకర్యాలను అందిస్తోంది. ఇప్పటికే ఉన్న కౌంటర్లు, ఏజెంట్లు, వెబ్‌సైట్ బుకింగ్(Website booking) విధానాలతో పాటు, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ మరియు వాట్సాప్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకోవడం సులభమవుతుంది.
Read Also: AP RoadAccident: హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ప్రయాణీకులకు గూగుల్ మ్యాప్స్, వాట్సాప్ ద్వారా ముందస్తు టికెట్ బుకింగ్
గూగుల్ మ్యాప్స్(Google Maps)లో ప్రయాణ రూట్ సెర్చ్ చేసిన వెంటనే ఆ రూట్‌లో తిరిగే APSRTC బస్సుల వివరాలు, అందుబాటులో ఉన్న సీట్లు, సమయాలు లభిస్తాయి. ఇవి సులభంగా చూసి, అవసరమైన బస్సుకు టికెట్ రిజర్వ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి, “విజయవాడ నుండి విశాఖపట్నం” రూట్ సెర్చ్ చేసినప్పుడు, ప్రయాణ వ్యవధి, బైక్, కారు, బస్, రైళ్లలో వెళ్లే సమయాలు గూగుల్ మ్యాప్స్ ద్వారా స్పష్టంగా చూపిస్తుంది.

టికెట్ బుకింగ్ కొత్త సౌకర్యం
అలాగే, వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ కొత్త సౌకర్యంగా అందుబాటులోకి వచ్చింది. 9552300009 నంబర్‌కు “హాయ్” అని మెసేజ్ పంపితే APSRTC సేవల సమాచారం, రూట్ వివరాలు మరియు టికెట్ బుకింగ్ లింక్ అందుతుంది. టికెట్ బుకింగ్ ప్రక్రియ కూడా సులభంగా జరుగుతుంది – ముందస్తు రిజర్వేషన్, ప్రయాణికుల వివరాలు నమోదు, ఆన్‌లైన్ పేమెంట్ చేసి వెంటనే టికెట్ పొందవచ్చు.
వాట్సాప్ ద్వారా సౌకర్యాన్ని విస్తరించడం వల్ల ప్రయాణీకులకు ముందస్తు ప్లానింగ్ సులభమవుతుంది. అలాగే, సంక్రాంతి రద్దీ వేళ అదనపు బస్సులు ఏర్పాటు చేసి, బస్టాండ్లలో, రూట్లలో సర్వీసులను మెరుగుపరచడానికి APSRTC చర్యలు చేపడుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: