हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

APSRTC Free Bus: ఏపీలో పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ఫ్రీ బస్సు

Saritha
APSRTC Free Bus: ఏపీలో పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ఫ్రీ బస్సు

APSRTC Free Bus: ఏపీలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడే వారికి ఇది ఉపయోగపడబోతోంది. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: AP SSC Hall Tickets 2026: ఏపీలో రేపు టెన్త్ హాల్ టికెట్లు విడుదల

APSRTC Free Bus: ఏపీలో పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ఫ్రీ బస్సు
APSRTC: Free Bus 10th class exams in AP.. Free bus for students

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు అమలు

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు అమలురాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది ఏపీలో సుమారు 6.42 లక్షల మంది విద్యార్థులు 3,415 కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. వీరందరూ తమ ఇంటి నుండి పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి మరియు తిరిగి రావడానికి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉచిత ప్రయాణం కోసం విద్యార్థులు ఎలాంటి ప్రత్యేక పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు. బస్సులో కండక్టర్లకు తమ హాల్ టికెట్ (Hall Ticket) చూపిస్తే సరిపోతుందని ఆర్టీసీ స్పష్టం చేసింది.

పదో తరగతి విద్యార్ధులు ఇలా పరీక్షలకు వెళ్లేందుకు చేసే ఉచిత ప్రయాణానికి మూడు రకాల బస్సుల్ని అనుమతిస్తున్నారు. ఇందులో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. వీటిలో ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, తిరిగి వెళ్లేందుకు ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ఆర్టీసీ ఆదేశాలు ఇచ్చింది. దీంతో విద్యార్ధులు నేరుగా ఇంటి దగ్గరే బస్సు ఎక్కి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో పాటు తిరిగి వచ్చేందుకు కూడా వీలు కలగబోతోంది. పరీక్షలు జరిగినన్ని రోజులు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870