డిసెంబర్ నెలలో న్యూఇయర్ సందర్భంగా ప్రయాణికులకు గుడ్‌న్యూస్ అందింది. ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాకుళం–విజయవాడ(APSRTC) మార్గంలో నడిచే ఇంద్ర ఏసీ బస్సుల టికెట్ ఛార్జీలను 20 శాతం తగ్గించింది. ఇప్పటికే 928 రూపాయలుగా ఉన్న టికెట్ ఛార్జీ ఇప్పుడు 743 రూపాయలకుగలదని అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది మరియు డిసెంబర్ 31 వరకు కొనసాగనుంది. ప్రయాణికులకు సౌకర్యం, భద్రతా కృషిని కొనసాగిస్తూ, అర్ధరాత్రి బస్సుల ఏర్పాట్లు, సమయాల సమీక్షలు చేస్తూ ఆర్టీసీ(RTC) ముందుకు వస్తోంది.
Read also: 62 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిని ఆస్ట్రేలియా ప్రధాని

డిసెంబర్ ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు
శ్రీకాకుళం–విజయవాడ (2967) బస్సు(APSRTC) ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీకాకుళం నుండి బయల్దేరుతుంది. తిరిగి, విజయవాడ–శ్రీకాకుళం (2968) బస్సు ప్రతి రోజు రాత్రి 7:15 గంటలకు విజయవాడ నుండి వెళ్తుంది. చలికాలం కావడంతో ఏసీ బస్సుల డిమాండ్ కొంత తగ్గిన నేపధ్యంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు అధికారులు ఛార్జీలను తగ్గించినట్లు సమాచారం. అయితే, జనవరి నెలలో సంక్రాంతి సీజన్ వస్తుండటంతో టికెట్ ఛార్జీలను మళ్లీ సవరించే అవకాశం ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: