విజయవాడ: విదేశాల్లో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టేందుకు ఏపీ (AP) ఖనిజ అభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆలోచన చేస్తున్నది. ఇందులో భాగంగా ఆఫ్రికన్ దేశాల్లో గనులు దక్కించుకోవాలనే దిశలో ప్రణాళికలు సిద్ధం చేసింది. తద్వారా తవ్వకాలు చేసి సంస్థకు అదనపు రాబడి పెంచుకోవాలని భావిస్తోంది. సంస్థకు దశాబ్దాల తర బడి మంగంపేట ముగ్గురాయి తవ్వకాల్లో అనుభవం ఉంది. చీమకుర్తిలో గ్రానైట్ లీజులను కూడా నిర్వహిస్తోంది. కొంతకాలంగా మధ్యప్రదేశ్ లోని సులియారీలో బొగ్గు గనుల్లో తవ్వకాలు ఆరంభించింది. ఈ అనుభవంతోనే విదేశాల్లో లీజులు తీసుకోవాలని భావిస్తోంది. మన రాష్ట్ర పరిధిలోని బొగ్గు గనులకు ప్రభుత్వ రంగ సంస్థ టెండర్లు వేసి, పోటీలో నిలవాలని సీఎం చంద్రబాబు ఇటీవల సూచించారు.
Read also: YS Jagan: సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరైన జగన్

APMDC: Mining operations abroad
బ్లాక్ 12.04 చదరపు కిలోమీటర్ల
దీంతో ఏలూరు జిల్లాలోని చింతలపూడి, సోమవరం బొగ్గు బ్లాక్లకు టెండర్లు వేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. సోమవరం బ్లాక్ లో సగటున జి13 రకం బొగ్గు లభిస్తుంది. ఇది 38.08 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. చింతలపూడి బ్లాక్ లో సగటున జి12 రకం బొగ్గు లభిస్తుంది. బ్లాక్ 12.04 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. సోమవరం, చింతలపూడి బొగ్గు బ్లాక్ ల్లో భూగర్భ మైనింగ్ చేయాలని భావిస్తోంది. అలా చేస్తే గనక సంస్థకు గిట్టుబాటు కాదని కొందరు నిపుణులు అంటున్నారు. దీనికి బదులుగా ప్రత్యేక పద్ధతిలో భూమి లోపలి నుంచి మీథేన్ గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని సూచిస్తున్నారు.
ఆఫ్రికాలో లభించే ఇనుప ఖనిజం
అయితే ఈ బ్లాక్ కు టెండర్లు దాఖలు చేసేందుకు డిసెంబరు 24 వరకు గడువు ఉంది. ఆ లోపు అధ్యయనం చేసి బిడ్లు వేసేందుకు ఏపీఎండీసీ సిద్ధమవుతుంది. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండిసీ) ఇప్పటికే వివిధ దేశాల్లో మైనింగ్ కార్యకలాపాలు ఆరంభించింది. అదే విధంగా ఏపీఎండీసీ కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఆఫ్రికాలో లభించే ఇనుప ఖనిజం, బొగ్గుతో పాటు పలు ముఖ్య ఖనిజాల గనులు తీసుకోవాలనుకుంటోంది. ఇందుకు ఏదైనా ప్రైవేటు సంస్థతో కలిసి జాయింట్ వెంచర్గా ప్రాజెక్టులు చేపట్టాలని చూస్తోంది. ఏ దేశాల్లో ఏ గనులు దక్కించుకుంటే రాబడి వచ్చే అవకాశం ఉందో అధ్యయనం చేయాలంటూ సలహా సంస్థ కేపీఎంజీని ఆదేశించింది. ఈ మేరకు కసరత్తు మొదలైంది. త్వరలో దీనిపై ముందడుగు పడే అవకాశం ఉందని ఏపీఎండీసీ వర్గాలు తెలిపాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: