हिन्दी | Epaper

News Telugu: AP: యూట్యూబ్‌ ప్రభావం.. అత్తను చంపిన కోడలు

Rajitha
News Telugu: AP: యూట్యూబ్‌ ప్రభావం.. అత్తను చంపిన కోడలు

AP: విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా పెందుర్తిలో చోటుచేసుకున్న ఘోర ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. కుటుంబ కలహాలను తట్టుకోలేక ఓ కోడలు తన అత్తను సజీవదహనం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వేపగుంట అప్పన్నపాలెంలోని వర్షిణి అపార్టుమెంట్‌లో నివసిస్తున్న లలితాదేవి (30) తన అత్త కనకమహాలక్ష్మి (63)పై హత్యా ప్రణాళిక వేసింది. భర్త ఇంట్లో లేని సమయంలో లలితాదేవి, అత్తను పిల్లలతో కలిసి ‘దొంగా పోలీస్’ ఆట ఆడుదామని నమ్మించింది. ఆటలో భాగంగా కనకమహాలక్ష్మి చేతులు, కాళ్లు కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటల్లో చిక్కుకున్న అత్త అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న మనవరాలు శ్రీనయనకు గాయాలయ్యాయి.

Read also: Montha: మొంథా తుఫాన్‌ ప్రభావంపై కేంద్ర బృందాల పర్యటన

AP: యూట్యూబ్‌ ప్రభావం.. అత్తను చంపిన కోడలు

AP: యూట్యూబ్‌ ప్రభావం.. అత్తను చంపిన కోడలు

హత్య ఎలా చేయాలి నేరం చేసి తప్పించుకోవడం ఎలా?

AP: ఘటనను ప్రమాదంగా చూపేందుకు లలితాదేవి నాటకం ఆడింది. టీవీ పేలిపోయి అగ్నిప్రమాదం జరిగిందని అరుస్తూ పొరుగువారిని పిలిచింది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పెట్రోల్ వాసన రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తులో భాగంగా లలితాదేవి ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు, ఆమె యూట్యూబ్‌లో ‘హత్య ఎలా చేయాలి’, ‘నేరం చేసి తప్పించుకోవడం ఎలా’ అనే వీడియోలు సర్చ్ చేసినట్లు గుర్తించారు. విచారణలో ఆమె నేరాన్ని ఒప్పుకుని, అత్త నిరంతరం చాదస్తంగా ప్రవర్తించడంతో కోపం వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

📢 For Advertisement Booking: 98481 12870