ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు కల్పించడానికి కౌశలం కార్యక్రమం(KaushalamProgram) చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత నైపుణ్య పరీక్షలు (Skill Assessment) జరుగుతున్నాయి. ఈ పరీక్షలలో విద్యార్హత, నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యం, వృత్తి నైపుణ్యతను అంచనా వేస్తారు.
Read Also: AP: ప్రభుత్వ విద్య, పరిశ్రమల భాగస్వామ్యం బలోపేతమే ఐఐటి లక్ష్యం

పరీక్ష విధానం
పరీక్షలు ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు, మొత్తం 45 నిమిషాలపాటు నిర్వహించబడతాయి. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సైకోమెట్రిక్ అసెస్మెంట్, వ్యక్తిగత మరియు సాంకేతిక ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఇంగ్లీషులో కొన్ని ప్రశ్నలకు 30 సెకన్లుగా జవాబు ఇచ్చి వెబ్ కెమెరాలో రికార్డ్ చేయించాలి.
అభ్యర్థుల నియమాలు
పరీక్ష రాసే సమయంలో కెమెరా, మైక్రోఫోన్, ఫుల్ స్క్రీన్, లొకేషన్ యాక్సెస్ తప్పనిసరి. నియమాలు పాటించకపోతే అభ్యర్థి అర్హత కోల్పోతారు. ఈ కౌశలం కార్యక్రమం ద్వారా యువతకు స్థిరమైన వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు, ఉపాధి మార్గాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: