
AP: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం–పుల్లల చెరువు రహదారిపై అసాధారణ ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించిన స్థితిలో ఉన్న ఓ మహిళ మద్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హంగామా సృష్టించింది. ఆర్టీసీ బస్సు ముందే రోడ్డుపై కూర్చుని సుమారు అరగంట పాటు రచ్చ చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Read Also: Karimnagar honour killing : ప్రేమే శాపమైందా? కరీంనగర్‌లో యువకుడిపై దారుణం
ఈ కారణంగా బస్సులోని ప్రయాణికులు(Passengers), రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో చివరకు బస్సు డ్రైవర్ జోక్యం చేసుకుని ఆమెను రోడ్డుపక్కకు తరలించి బస్సును ముందుకు కదిలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: