AP: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సాక్షి (sakshi) దినపత్రికకు ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ బి.ఫణికుమార్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుపై మంగళవారం జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తీర్పు వెలువరించారు. ఆయన వ్యాఖ్యానిస్తూ — పిటిషనర్లు అపరిపక్వ దశలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల శిక్షణ తరగతులపై ప్రచురితమైన కథనానికి సంబంధించి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సాక్షి పత్రికకు నోటీసులు జారీ చేసింది.
Read also: APSRTC Jobs: ఏపీఎస్‌ఆర్‌టీసీ లో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా?

AP: హైకోర్టు లో సాక్షి కి షాక్.. పిటిషన్ల కొట్టివేత
AP: దానిని సవాల్ చేస్తూ పత్రిక ప్రతినిధులు కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు కమిటీ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. షోకాజ్ నోటీసు జారీ తర్వాత ఇంకా పలు దశలు ఉంటాయని, పిటిషనర్ల వివరణను కమిటీ పరిశీలించే అవకాశం ఉందని పేర్కొంది. అడ్వకేట్ జనరల్ వాదనలను సమర్థించిన హైకోర్టు, ఆర్టికల్ 194 (శాసనసభ హక్కులు) మరియు ఆర్టికల్ 19(1A) (వాక్ స్వాతంత్ర్యం) మధ్య ఉన్న సంబంధంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటికే విచారణ జరుపుతోందని గుర్తుచేసింది. అలాంటి పరిస్థితిలో కమిటీ పనిలో జోక్యం సరైంది కాదని స్పష్టం చేస్తూ, పిటిషన్లు అపరిపక్వమైనవని పేర్కొని వాటిని కొట్టివేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: