ఆంధ్రప్రదేశ్ లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది అని భారత వాతావరణశాఖ (IMD) ప్రకటించింది. ఈ అల్పపీడనం సోమవారం నాటికి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: Hyderabad : గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్

భారీ నుంచి అతి భారీ వర్షాలు
48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశముందని అంచనా వేసింది. ఈ నెల 27-29 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. అటు ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: