हिन्दी | Epaper

News Telugu: AP: రాష్ట్రంలో రూ.16 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధిస్తాం: పీయూషకుమార్

Rajitha
News Telugu: AP: రాష్ట్రంలో రూ.16 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధిస్తాం: పీయూషకుమార్

విజయవాడ : ప్రభుత్వ శాఖలను మూడు విభాగాలుగా చేసి జీఎస్డీపీతో మ్యాపింగ్ చేశాం ఏపీ తప్ప ఏ రాష్ట్రమూ ప్రతి త్రైమాసికానికి ఇలా వృద్ధి గణాంకాలు విడుదల చేయడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఏడాది ఒకటి రెండు సార్లు విడుదల చేసినా ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదు. స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ఈ నివేదికలు ఎంతో ఉపయోగపడతాయి’ అని రాష్ట్ర ప్రణాళిక, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శి పీయూషకుమార్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.16.88 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తిని సాధించాలనేది లక్ష్యమని తెలిపారు. తొలి 6 నెలల్లో 41% సాధించామని, మిగిలిన లక్ష్య సాధనకు రంగాల వారీగా నిర్దిష్ట వ్యూహాలు అవలంభిస్తామని చెప్పారు.

Read also: Ananthapuram: వార్డెన్ పై కోపంతో విద్యార్థినుల ఆత్మహత్యా

AP

We will achieve production worth ₹16 lakh crore in the state

జాతీయ స్థాయితో పోలిస్తే 2.6% అధికంగా

రాష్ట్రవృద్ధి రేటు ఎంతో బాగున్నా ద్రవోల్బణం వల్ల ఆ వృద్ధి మొత్తం ప్రతిఫలించడం లేదు. జాతీయ స్థాయితో పోలిస్తే 2.6% అధికంగా ఉంది. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖలో కొత్త పారావీ ఎటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయంలో కూడా వినియోగం ఆధారంగా ఉత్పత్తి ఉండేలా చూస్తున్నాం. ఆర్టీజీఎస్ నూ అనుసంధానం చేస్తున్నాం. పరిశ్రమల రంగంలో దేశం కన్నా మంచి పురోగతి సాధించాం. మధ్య చిన్న తరహా పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు అందించాం. అంతర్జాతీయ డిమాండ్ కు తగ్గట్టుగా ఉత్పత్తి ఉండేలా చూస్తున్నాం. గనుల విభాగాన్ని కూడా బలోపేతం చేశాం. ఆర్టీజీఎస్లో ప్రత్యేకంగా ‘డిజీ వెరిఫై’ అనే ఏర్పాటు చేశాం. ఏ ధృవపత్రాలైనా ఇక ఈ విభాగంలో సులభంగా, వేగంగా తనిఖీ చేయవచ్చు.

ఏపీపీఎస్సీ వంటి సంస్థలకు ఉద్యోగాలు

అవి అసలైనవో కావో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆర్టీజీఎస్ ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది. అని ఐటీ ఆర్టీజీ శాఖల కార్యదర్శి కాటమనేని భాస్కర్ చెప్పారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాల కోసమే లబ్ధిదారులు సమర్పించే ధృవ పత్రాలను విద్యార్థుల సర్టిఫికెట్లను తనిఖీ చేయాలన్నా, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే ఎంతో వేగoగా పరిశీలన పూర్తవతుందన్నారు. ఏపీపీఎస్సీ వంటి సంస్థలకు ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ధృవీకరణ పత్రాల తనిఖీకి చాలా సమయం పడుతోందని, ఇక ఆ అవసరం ఉండదని డిజి వెరిఫై ద్వారా సులభంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సదుపాయాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

📢 For Advertisement Booking: 98481 12870