రేపటినుండి పెద్ద ఎత్తున భేటీలు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సచివాలయం : రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ 2025 కోసం విశాఖ సన్నద్ధం అయింది. సదస్సును విజయవంతంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. విశాఖలో (visakhapatnam) ని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Read also: Geophysical survey: తుది అంకానికి ఎస్ఎల్బిసి జియోఫిజికల్ సర్వే

AP: భాగస్వామ్య సదస్సుకు విశాఖ రెడీ
100కి పైగా విదేశీ ప్రతినిధులు
పార్టనర్ ఇన్ ప్రొగ్రెస్ ఇండియస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ 2047 థీమ్తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. 100కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనే అవకాశంతో పాటు పెట్టుబడులకు సంబంధించి 30కి పైగా అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి. బుధవారం నుంచి సదస్సు ముగిసే శనివారం వరకు వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు. నవంబర్ 13 గురువారం విశాఖలో నోవటెల్లో లో పార్టనర్స్ ఇన్ ప్రొగ్రెస్ -ఇండియా- యూరప్ కోపరేషన్ ఫర్ సస్టెయిన బుల్ గ్రోత్ అంశంపై జరిగే ఇండియా- యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొంటారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: