విజయవాడ: AP ఎనిమిదో వేతన సంఘం నివేదిక జాప్యాన్ని నివారించే క్రమంలో, 2026 జనవరి 1 నుండి వేతన సంఘం నివేదికతో సంబంధం లేకుండా రైల్వే ఉద్యోగులకు(railway employees) వేతనాలు, అలవెన్సులను అమలు చేయాలని ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ (AIRF) జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే మజ్జూర్ యూనియన్ 55వ వార్షిక సాధారణ మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Read Also: Shivdhar Reddy: ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్

రైల్వేలో ఖాళీల భర్తీ, ఔట్‌సోర్సింగ్ విధానంపై అభ్యంతరం
రైల్వేలలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానం అనేది ప్రమాదకరంగా మారుతోందని శివగోపాల్ మిశ్రా అభిప్రాయపడ్డారు. రైల్వే ఆస్తుల భద్రత, ప్రయాణికుల సురక్షితం కొరకు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రైల్వేలను ఆధునికరించడాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో ఉద్యోగులపై అధిక పని భారం తగ్గించి, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకు గురికాకుండా చూడాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
పెన్షన్, రైల్వే జోన్ సమస్యలు
- వేతన సంఘం: జనవరి 2025లో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేసినప్పటికీ, చైర్మన్ నియామకం, నిబంధనల ఏర్పాటు వంటివి 14 నెలల తర్వాత ప్రకటించడంతో ఉద్యోగులకు ఆర్థికంగా నష్టం జరుగుతోందని మిశ్రా తెలిపారు.
- పెన్షన్: ‘నాన్ కంట్రిబ్యూటరీ ఫండ్ పెన్షన్’ వంటి పదాలను ఉపయోగించడం వల్ల పెన్షన్ ఉద్యోగుల హక్కుగా కాకుండా, ప్రభుత్వంపై ఆర్థిక భారం దృష్టితో చూడబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
- రైల్వే జోన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,(Chandrababu Naidu) కేంద్ర రైల్వే మంత్రి, ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సేవలు ప్రారంభమయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: