విజయవాడ : అమెరికాలో(America) దాదాపు 8 ఏళ్ళ కితం హత్యకు గురైన ఏపీ మహిళ హత్యకేసులో అసలు నిందితుడిని అక్కడి పోలీసులు గుర్తించారు. అమెరికాలో(AP) ఆంధ్రప్రదేశ్ కు చెందిన శశికళ నర్రా అనే మహిళ 2017లో తన కుమారుడితో సహా దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎనిమిదేళ్ళ తర్వాత అసలు నిందితుడుని గుర్తించారు. అసలేమయ్యిందంటే… ఆంధ్రప్రదేశ్ కు చెందిన నర్రా హనుమంతరావు అనే వ్యక్తి అమెరికాలోని న్యూజెర్సీలో భార్య శశికళ, కొడుకు అనీష్ సాయితో కలిసి నివసించేవాడు. 2017 మార్చి 23న హనుమంతరావు విధులు ముగించుకుని వచ్చేసరికి… మాపుల్ షేడ్ లోని వారి అపార్ట్మెంట్లో భార్య, కొడుకు రక్తపు మడుగులో పడిఉండటాన్ని గుర్తించారు.
Read also: ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం

హనుమంతరావు నిర్దోషి, కొత్త కోణంలో దర్యాప్తు
దీనిపై పోలీసులకు(AP) సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వీరి మరణాలకు భర్త నర్రా హనుమంతరావే కారణమని…అతడికి ఒక కేరళ మహిళకు మధ్య ఉన్న వివాహేతర సంబంధంతోనే భార్యాబిడ్డలను హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపించడంతో అతడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఘటనాస్థలంలో లభించిన డిఎన్ఎ హనుమంతరావు డీఎన్ఏతో సరిపోకపోవడంతో అతడిని విడుదల చేశారు. హనుమంతరావు సహోద్యోగి హమీద్ గొడవలు ఉన్నట్లు విచారణలో భాగంగా అధికారులు గుర్తించారు. ఈ హత్య కేసులో హమీదుకు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సమయంలో హత్య జరిగిన ఆరు నెలల అనంతరం అతను భారత్ కు తిరిగి వెళ్ళినట్లు గుర్తించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: