విజయవాడ : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను (Income Tax) ఫైలింగ్ పై అవగాహన కల్పించడం ద్వారా సంస్థకు సమగ్ర ప్రయోజనం కలగడం తో పాటు, ఉద్యోగుల వ్యక్తిగత ఆర్థిక బాధ్యతల్లో స్పష్టత పెరుగుతుందని ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.వి. రమణ మూర్తి పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలోని విద్యుత్ సౌధ లో నిర్వహించిన ఈ అవగాహనా కార్యక్రమంలో ఉద్యోగులకు టాక్స్ ఫైలింగ్ ప్రాసెస్, కీలక సమాచారం, లాభాలు, తప్పక పాటించాల్సిన నిబంధనలు తదితర అంశాలపై జాయింట్ కమీషనర్ ఇన్కమ్ టాక్స్ (Income Tax) అభినయ, ఇన్కమ్ టాక్స్ డిప్యూటీ కమిషనర్లు డాక్టర్ టీ. సవీష్ వర్మ ప్రేమ్ కుమార్ (Savish Verma Prem Kumar), ఐఆర్ఎస్ సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్కో ఎస్ఏ సిసిఏ వీ.డి. సర్వేశ్వర రావు, ఎస్ఏ సిసిఏ కె.వి.ఎస్.ఎన్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక పరిజ్ఞాన పెంపుకోసం అవగాహనా కార్యక్రమం
ఈ తరహా అవగాహనా కార్యక్రమాలు ఉద్యోగుల ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో సహాయపడతాయని, ముందుగానే పన్నుల ఫైలింగ్ పూర్తి చేయడం ద్వారా లెక్కల లోపాలు నివారించగలమని డైరెక్టర్ ఫైనాన్స్ (Director Finance) అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా డా. సవీష్ వర్మ ఏ పీ ట్రాన్స్కో కు సంబంధించి సెక్షన్ 192, 1948, 1941, 1948, 194 ລ້໖ , 2025 ໖໖ 1 నుండి అమల్లోకి వచ్చిన తాజా మార్పులపై వివరించారు. టిడిఎస్ చెల్లింపు, రిటర్న్ ఫైలింగ్ మరియు సర్టిఫికెట్ల జారీ వాయిదా వేయడం వల్ల ఎదురయ్యే వడ్డీ, జరిమానా, శిక్షలపై ఉద్యోగులను అప్రమత్తం చేశారు. సాధారణంగా జరిగే తప్పిదాలు (సెక్షన్ కోడ్లు, చలాన్ వివరాల పొరపాట్లు) నివారించేందుకు చాలన్ చెక్స్ట్లు, సాఫ్ట్వేర్ టూల్స్ ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రేమ కుమార్ 2024-25కి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ ప్రాముఖ్యతను వివరించారు. ఫైలింగ్ కేవలం చట్టబద్ధ విధినే కాకుండా, రిఫండ్లు పొందడం, ఆర్థిక పారదర్శకత కోసం అవసరమని చెప్పారు. ఆచా ఫారాల అనుసంధానం, పాత మరియు కొత్త పన్ను విధానాల మధ్య తేడాలు, సెక్షన్ 87 కింద రూ. 75,000/ వరకు రీఫండ్, మరియు తప్పిద దావాలపై శాఖ చర్యలు వంటి అంశాలపై కూడా వివరంగా చర్చ జరిగింది. ఏపీ ట్రాన్స్కో డిప్యూటీ సిసిఏ బీ. నాగరాజు, డిప్యూటీ సిసిఏ పీ.బీ.కె. శర్మ, విద్యుత్ సౌధలో పనిచేస్తున్న సిబ్బంది తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ అంటే ఏమిటి?
ఆదాయపు పన్ను రిటర్న్ లేదా ఐటీఆర్ అనేది ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి మీ స్థూల పన్ను విధించదగిన ఆదాయాన్ని చూపించడానికి ఉపయోగించే ఒక ఫారమ్ . పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం, క్లెయిమ్ చేసిన తగ్గింపులు, మినహాయింపులు మరియు చెల్లించిన పన్నులను అధికారికంగా ప్రకటించడానికి ఈ ఫారమ్‌ను ఉపయోగిస్తారు. కాబట్టి, ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో మీ నికర ఆదాయ పన్ను బాధ్యతను లెక్కిస్తుంది.
ఆదాయపు పన్ను రిటర్న్ మొత్తం?
ఆదాయపు పన్ను వాపసు అంటే పన్నులలో చెల్లించిన మొత్తం వాస్తవ బకాయి మొత్తాన్ని మించి ఉంటే (TDS లేదా TCS లేదా ముందస్తు పన్ను లేదా స్వీయ-అంచనా పన్ను ద్వారా) ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించే వాపసు మొత్తం..
Read hindi news: hindi.vaartha.com
Read Also: TTD: ఆగస్ట్ 8న టిటిడి ఆలయాల్లో సౌభాగ్యం..28న సద్గమయ కార్యక్రమం