हिन्दी | Epaper

AP Train Accident: రైలు ఢీకొని విద్యార్థిని మృతి

Saritha
AP Train Accident: రైలు ఢీకొని విద్యార్థిని మృతి

AP Train Accident: ప్రకాశం జిల్లా చినగంజాం రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఒక ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మృతురాలిని నల్లమోపు హేమశివ శృతి (16)గా పోలీసులు గుర్తించారు. శృతి స్థానికంగా తొమ్మిదో తరగతి చదువుతోంది. గురువారం రోజున రైల్వే పట్టాలు దాటుతుండగా అప్పుడే ఒంగోలు నుంచి బిలాస్‌పూర్‌ వైపు వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆమెను బలంగా ఢీకొట్టింది.

Read Also: Andhra Pradesh: కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

AP Train Accident: రైలు ఢీకొని విద్యార్థిని మృతి
AP Train Accident: Student dies after being hit by train

రైలు వేగంగా ఢీకొనడంతో శృతి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి ఎదిగిన కూతురు కళ్లముందే విగతజీవిగా పడి ఉండటం చూసి వారు తల్లడిల్లిపోతున్నారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870