విజయవాడ : ఆంధ్రప్రదేశ్ (AP) పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ఎడిటి&ఐ) సహకారంతో 2026 ఫిబ్రవరి 13,14 తేదీల్లో విశాఖపట్నం వేదికగా ‘ఎడిటిఒ’ నేషనల్ టూరిజం మార్ట్ 2025 నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. బుధవారం వెలగపూడి సచివాలయం రెండవ బ్లాక్లోని తన కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఎడిటిఓఐ ప్రతినిధులతో ఎంవోయూ (అవగాహన ఒప్పందం) కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశను దేశీయ పర్యాటక రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎంవోయూ కుదుర్చుకున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.
Read also: AP tourism news : విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..

AP Tourism
మెరుగైన మౌలిక వసతులు కలిగిన విశాఖ నగరం
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అద్భుతమైన తీరప్రాంతం, మెరుగైన మౌలిక వసతులు కలిగిన విశాఖ నగరం ఈ జాతీయ స్థాయి ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని కోస్టల్ టూరిజం, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రకకట్టడాలు, ఎకోఅడ్వెంచర్ టూరిజం, ఏజెన్సీ ప్రాంతాల పర్యాటకాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప వేదికని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ బీ2బీ నెట్ వర్కింగ్ సెషన్లు, గమ్యస్థానాల ప్రదర్శనలు, వ్యాపార సమావేశాలు, ప్యానెల్ చర్చలు, పర్యాటక ప్రాంతాల సందర్శన కార్యక్రమాలద్వారా స్థానిక పర్యాటక వాటాదారులకు జాతీయ స్థాయిలో వ్యాపార సంబంధాలు ఏర్పడతాయని తాము భావిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అపారమైన, వైవిధ్యభరితమైన పర్యాటక అవకాశాలను ప్రదర్శించడానికి ఇదొక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని వెల్లడించారు.
దేశీయ పర్యాటకాన్ని బలోపేతం చేయడం
ఈ చొరవ వల్ల రాష్ట్రానికి పర్యాటకుల రాక పెరగడమేకాకుండా. స్థానికులకు ఉపాధి అవకాశాలు, దీర్ఘకాలిక వ్యాపారసంబంధాలు మెరుగుపడతాయని, జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ.. దేశీయ పర్యాటకాన్ని బలోపేతం చేయడం. అంతగా ప్రాచుర్యంలేని పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించడం, వెలుగులోకి తీసుకురావడం, స్థానిక వర్గాలకు స్థిరమైన పర్యాటక వృద్ధి, ఉపాధి అవకాశాలను కల్పించడం తమ అసోసియేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పర్యాటక శాఖ కూడా బాధ్యతాయుతమైన, సమగ్రమైన పర్యాటక వృద్ధిని సాధించేందుకు జాతీయ సంఘాలతో కలిసి పనిచేస్తామని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: