ఆంధ్రప్రదేశ్ (AP) ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డు కార్యక్రమంలో కీలక దశకు చేరుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉచిత పంపిణీకి రేపటితో చివరి గడువని అధికారులు స్పష్టం చేశారు.
Read Also: Tirumala: తిరుమల దర్శనానికి 18 గంటల సమయం

తొలివిడత పంపిణీలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానం
పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గడువు ముగిసిన తర్వాత కార్డు పొందాలంటే రూ.200 చెల్లించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 6,14,000 రేషన్ కార్డులు ఉండగా, ఇప్పటికే 95.5 శాతం అంటే 5,87,000 కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రంలోనే (AP) తొలివిడత పంపిణీలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఇంకా 27,000 కార్డులు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: