ఆంధ్రప్రదేశ్‌లోని(AP) బాపట్ల జిల్లా చీరా మండలంలోని వాడరేవు తీరంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు దిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే — అమరావతిలోని విట్ యూనివర్సిటీకి చెందిన 10 మంది విద్యార్థులు విరామం సందర్భంగా వాడరేవుకు వచ్చారు. అందులో కొందరు సముద్రంలో ఈతకు దిగగా, అలల తీవ్రతకు ముగ్గురు యువకులు ఆంధ్రప్రదేశ్‌లోని(AP) బాపట్ల జిల్లా కొట్టుకుపోయారు.
Jaggaiahpet: క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట

స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ముగ్గురిని కాపాడలేకపోయారు. కొద్దిసేపటికే వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాకేత్, జీవన్ సాత్విక్, సాయి మణిదీప్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఇంకా ఇద్దరు విద్యార్థులు — సోమేష్ మరియు చీరాలకు చెందిన గౌతమ్ గల్లంతైనట్లు సమాచారం. వీరి కోసం అగ్నిమాపక మరియు మత్స్యశాఖ సిబ్బంది సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక తెలంగాణలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. హిమాయత్‌సాగర్ బ్యాక్‌వాటర్ వద్ద మూసీ నదిలో ఈతకు దిగిన ఇద్దరు యువకులు కనిపించకుండా పోయారు. NDRF(National Disaster Response Force) మరియు గజ ఈతగాళ్లు వారిని వెతికే పనిలో ఉన్నారు.
వాడరేవు తీరంలో ప్రమాదం ఎక్కడ జరిగింది?
బాపట్ల జిల్లా చీరా మండలంలోని వాడరేవు బీచ్ వద్ద ఈ ఘటన జరిగింది.
మృతి చెందిన విద్యార్థులు ఎవరు?
హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాకేత్, జీవన్ సాత్విక్, సాయి మణిదీప్ సముద్ర అలల తాకిడికి ప్రాణాలు కోల్పోయారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: