ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (AP) చంద్రబాబు నాయుడు(CM Chandrababu) పార్టీ లో కీలక మార్పుల కోసం సిద్దమయ్యారు. సుదీర్ఘ ఆలోచనలు, కసరత్తు అనంతరం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త పార్టీ అధ్యక్షుల ఎంపికపై నిర్ణయం తీసుకున్నారు. సీనియార్టీ, విధేయత, సామాజిక సమీకరణాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకొని ఎంపిక జరిగింది. ముఖ్యంగా పార్టీ పదవుల్లో సీనియర్లకు, సామాజిక సమీకరణాలను ప్రతిబింబించే వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించడంపై దృష్టి పెట్టారు. త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా కొత్త నియామకాల్ని ప్రకటించనున్నారు.
Read also: AP: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో కొత్త జోనల్, మల్టీ జోన్ సిస్టమ్

ఎంపికలు, రాష్ట్ర వారీ వివరాలు
తాజా జాబితా(AP) ప్రకారం సుమారు 10 మంది సీనియర్ నేతలకు అవకాశం లభించింది. తిరుపతి జిల్లా: పనబాక లక్ష్మి, చిత్తూరు జిల్లా: షణ్ముగం, అన్నమయ్య జిల్లా: సుగవాసి ప్రసాద్, ప్రకాశం జిల్లా: ఉగ్ర నరసింహారెడ్డి, అనంతపురం జిల్లా: కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లా: ఎంఎస్ రాజు, నంద్యాల జిల్లా: ధర్మవరపు సుబ్బారెడ్డి, విజయనగరం జిల్లా: కిమిడి నాగార్జున, ఏలూరు జిల్లా: బడేటి చంటి, కాకినాడ జిల్లా: జోత్యుల నవీన్, బాపట్ల జిల్లా: సలగల రాజశేఖర్, పల్నాడు జిల్లా: కొమ్మాలపాటి శ్రీధర్, గుంటూరు జిల్లా: పిల్లి మాణిక్యాలరావు, ఎన్టీఆర్ జిల్లా: గద్దె అనురాధ, కృష్ణా జిల్లా: వీరంకి గురుమూర్తి, పశ్చిమ గోదావరి జిల్లా: రామరాజు, తూర్పుగోదావరి జిల్లా: వెంకటరమణచౌదరి, కోనసీమ జిల్లా: గుత్తుల సాయి, విశాఖ జిల్లా: చోడే పట్టాభిరామ్, అనకాపల్లి జిల్లా: బత్తుల తాతబ్బాయ్, కర్నూలు జిల్లా: వహీద్, నెల్లూరు జిల్లా: బీదా రవిచంద్ర, కడప జిల్లా: భూపేశ్ రెడ్డి.
పార్టీ లో ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీ మరియు మైనార్టీల సామాజిక సమీకరణాన్ని పరిగణలోకి తీసుకొని నియామకాలు చేశారు. పిల్లి మాణిక్యాలరావు, వీరంకి గురుమూర్తి, కోట్ని బాలాజీ, బొడ్డు వెంకట రమణ చౌదరి, మంతెన రామరాజు, సలగల రాజశేఖర్, మన్నే సుబ్బారెడ్డి తదితరులు ముఖ్య నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. రాజంపేట, కడప వంటి ముఖ్య పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష పదవులపై పరిశీలనలు కొనసాగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: