పూసపాటి రాజవంశీయులు మరో భారీ విరాళం ప్రకటించారు. విజయనగరంలో పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబానికి వారి పూర్వీకుల నుంచి రాజ కుటుంబంగా గుర్తింపు ఉంది. ఇప్పటికే విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల కోసం రూ.వేల కోట్ల ఆస్తులను వదులుకున్నారు. ఇప్పుడు సుమారు రూ.1000 కోట్లు విలువైన భూమిని విరాళం ఇచ్చేందుకు అశోక్ గజపతి రాజు కుటుంబం ముందుకు వచ్చింది. విశాఖలో ఖరీదైన భీమిలి వద్ద ఉన్న భూమిని విరాళం గా ప్రకటించారు.
Read Also: AP: TDP జిల్లా అధ్యక్షులు వీరే!
160 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటు
విశాఖపట్నం – విజయనగరం సరిహద్దుల్లోఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీనిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. జీఎంఆర్ గ్రూప్. మాన్సాస్ ట్రస్టు ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. ఇటీవలే మంత్రి నారా లోకేష్ సమక్షంలో జీఎంఆర్ – మాన్సాస్ ఎడ్యు సిటీ ప్రాజెక్టుకు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 160 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీనిర్మాణానికి కోసం భూమిని విరాళం గా ప్రకటించారు.

ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు కోసం 136.63 ఎకరాలు భూమిని అందించేందుకు మాన్సాస్ ట్రస్టు ముందుకు వచ్చింది. విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం వద్ద ఉన్న ఈ భూమిని ఏవియేషన్ ప్రాజెక్టుకు ఇచ్చేందుకు పూసపాటి వంశీయురాలు, అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో జీఎంఆర్ – మాన్సాస్ ఎడ్యు సిటీ ప్రాజెక్టుకు పూసపాటి రాజవంశీయుడైన అలక్ మహారాజా గజపతి పేరు పెట్టాలని అదితి గజపతిరాజు కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: