రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ : రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు(AP) గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathy) అన్నారు. ఎక్కడ లేని విధంగా 24 గంటల్లో పైకం చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం మంత్రి రాష్ట్ర గౌడ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి జన్మదిన వేడుకలలో భాగంగా తొట్ల వల్లూరులో ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తాను రైతు బిడ్డ అని, రైతుల కష్టాలు తెలుసని, రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతోనే తాను కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం డబ్బులు రైతులకు చెల్లించే ఏర్పాటు చేశామన్నారు. శనివారం జరిగిన సంఘటనను వివరిస్తూ మంత్రి కొంతమంది రైతులు రైస్ మిల్లర్ల నుండి తడిసిన ధాన్యం సంబంధించి నష్టపోతున్నట్లు తన దృష్టికి తీసుకొని వచ్చారన్నారు. ఈ విషయమై అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. తన సొంత ఊరు కారకంపాడు నుండి వస్తుంటే పక్క గ్రామం అయిన పెద్ద ముత్తేవి నుండి 3 లారీల ధాన్యం లోడ్ చేసుకుని వెళుతుంటే లారీలను ఆపి ఎక్కడి నుండి వస్తున్నాయి, ధాన్యం ఎంతకు కొనుగోలు చేశారు అని లారీ డ్రైవర్ను అందులోని వారిని అడిగితే తమకు తెలియదని తాము కేవలం రవాణాకు చెందిన వాళ్ళమని గుడివాడ రైల్వే షెడ్లో వ్యాగిన్స్లో లోడ్ చేసుకునేందుకు తీసుకెళుతున్నట్లు చెప్పారన్నారు.
Read also: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

తక్కువ ధరకు ధాన్యం కొనుగోలుపై మంత్రి ఆగ్రహం
ఎవరు(AP) కొన్నారు వారిని పిలిపించాలని పక్క గ్రామమే కదా అని వారిని అడిగితే ప్రక్క గ్రామం నుండి వారు వచ్చారన్నారు. నాతో మొదట 1550 అని ఆ తరువాత 1450 రూపాయలకు కొనుగోలు చేసినట్లు చెప్పార న్నారు. అంత తక్కువకు కొనుగోలు ఎలా చేశారని చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించానన్నారు. వెంటనే గోనెసంచిలో నుండి ధాన్యాన్ని బయటకు తీసి తేమ శాతం పరీక్షించే యంత్ర పరికరాన్ని తెప్పించి పరిశీలిం చగా 22శాతం తేమ ఉందన్నారు. అడిగితే ధాన్యం రంగు మారిందని చెప్పారు. అక్కడే ఒక బేరగాడు ఉంటే ధాన్యాన్ని అరచేతిలో వేసుకుని నూరితే లోపల బియ్యం ఎక్కడ రంగు మారలేదన్నారు. బియ్యం అంతా బాగానే ఉన్నా నూక రంగు మారితే మీకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించామన్నారు. ఎవరు దీన్ని తక్కువ ధరకు కొనమని చెప్పారని అంటూ రైతు సేవా కేంద్రంలోని సాంకేతిక సిబ్బందిని పిలిపించామన్నారు. తేమ శాతం వరికరాన్ని అప్పటికప్పుడు తెప్పించామన్నారు.
నిబంధనల ప్రకారమే రైతులకు పూర్తి చెల్లింపులు
తేమశాతం పరిశీలిస్తే 22 శాతం ఉందని ధాన్యం బాగుందని ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 17కంటే ఎన్ని పాయింట్లు ఎక్కువ ఉంటే అన్ని కిలోల బియ్యం తగ్గించుకోవలసి ఉంటుందన్నారు. ఆ ప్రకారం 5 కిలోల బియ్యానికి కిలో 24 రూపాయల చొప్పున 120 రూపాయలు తగ్గించాల్సి ఉంటుందన్నారు. ఆ ప్రకారం 1450 రూపా యలు కొనుగోలు చేయడం ఏంటని మిల్లర్లతో మాట్లా డటం జరిగిందన్నారు. 1650 రూపాయలు చెల్లిస్తే గాని లారీలను వెళ్ళనివ్వ మని గట్టిగా చెప్పడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం లాగా రైతులకు డబ్బులు ఎగ్గొట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అనా పైసలతో సహా నిబంధనల ప్రకారం ప్రతి రైతు పండించిన పంటకు ధర చెల్లించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతులకు చెల్లిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. తాను పేదరికం నుంచి వచ్చానని తనకు రైతుల బాధలు తెలుసన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకూడదన్నది ప్రధాన ఉద్దేశం, ప్రతి రైతుకు మేలు జరగాలన్నదే తమ అభిమతం అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: