ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరలను పెంచడానికి ఏపీ (AP) రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ది రాజాసాబ్’ సినిమాకి సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరపై రూ.150 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.200 (జీఎస్టీతో కలిపి) పెంచుకోడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది.
Read Also: Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ విడుదల
ప్రీమియర్ షో టికెట్ ధర
పది రోజుల పాటు ప్రత్యేక ధరలు అందుబాటులో ఉంటాయి. ముందు రోజు రాత్రి ‘ది రాజాసాబ్’ స్పెషల్ ప్రీమియర్ షోలు పడబోతున్నాయి.జనవరి 8న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యలో షో వేసుకోడానికి పర్మిషన్ ఇచ్చారు. ప్రీమియర్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.1000 పెంచుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓజీ తర్వాత ఈ రేంజ్ లో టికెట్ రేట్స్ హైక్ ఇచ్చిన సినిమా ఇదేనని చెప్పాలి.

మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ హారర్ ఫాంటసీ కామెడీలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక రోల్‌లో కనిపిస్తారు. తమన్ మ్యూజిక్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: