రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి మరో కీలక ముందడుగు పడనుంది. ఏపీలో ఇప్పటివరకు మొబైల్ నెట్‌వర్క్ లేని లేదా సరైన కనెక్టివిటీ లేని 120 గ్రామాలకు 4జీ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా, డిజిటల్ ఇండియా నిధి కింద ఈ సేవలను అందించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రజలకు ఆధునిక సాంకేతిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Read Also: AP: సీఎం చంద్రబాబుకు అవార్డు.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

హైస్పీడ్ ఇంటర్నెట్
ఈ 4జీ సేవలను మొదటి దశలో అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, పల్నాడు, నెల్లూరు, సత్యసాయి, శ్రీకాకుళం జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఈ జిల్లాల్లోని దూర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, గ్రామాలు ఇప్పటివరకు నెట్‌వర్క్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు అక్కడ కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు అమలుకు టెలికాం శాఖ రూ.120 కోట్లు ఖర్చు చేయనుంది.ఈ విషయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడించారు. ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: