ఎన్నాళ్ల కల సాకారం కావడానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కోసం సిద్ధమవుతోంది. (AP) విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న ఈ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ ఫైనల్ ఫేజ్‌లోకి వచ్చింది. రన్ వే, ఏటీసీ సెంటర్లు, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, నావిగేషన్ మరియు రాడార్ సిగ్నల్స్ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఈ నెల 4న ఢిల్లీ నుంచి ఫస్ట్ వ్యాలీడేషన్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. కేంద్ర విమానాయన మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) ఇతర ప్రముఖులు ఈ ఫ్లైట్‌లో భోగాపురానికి చేరనున్నారు.
Read also: Tulluru accident: రోడ్డుపై ఉన్న గుంతలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

ప్రత్యేకతలు, భవిష్యత్ అభివృద్ధి
భోగాపురం ఎయిర్‌పోర్ట్ 2,200 ఎకరాల విస్తీర్ణంలో, 4,750 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించబడింది. ఇది ఉత్తరాంధ్రకు సరికొత్త గేట్వేగా, భారతావనికి ముఖ్యమైన అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌గా మారనుంది. (AP) తొలి విడతలో సంవత్సరం పైన 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు సామర్థ్యం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి కార్గో సదుపాయాలు ప్రారంభమవుతాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ లో తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ మరియు ఇన్నోవేషన్ హబ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ కూడా ఎయిర్‌పోర్ట్‌కు అనుబంధంగా నిర్మించబడుతోంది. రన్ వే, టెర్మినల్, ATC సిస్టమ్స్ అన్ని జెట్ స్పీడ్‌లో నిర్మాణం పూర్తి చేయబడ్డాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ద్వారా ఉత్తరాంధ్రకు విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: