విజయవాడ: సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన 8 ఒప్పందాలతో ఐదు జిల్లాల్లో టెక్స్ టైల్స్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత (savitha) తెలిపారు. విశాఖ, చిత్తూరు, గుంటూరు, శ్రీసత్యసాయి, అనకాపల్లి జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. వీటి ద్వారా 6,460 మందికి ఉద్యోగాలొచ్చే అవకాశాలున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. టెక్నికల్ టెక్స్ టైల్స్ల్స్, రీసైక్లింగ్, గార్మెంట్స్, సిల్క్, అపెరల్ రంగాల్లో పెట్టుబడులు రానున్నాయన్నారు.
Read also: AP: ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం ప్రారంభం

రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని
విశాఖపట్నంలో ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ రూ.4వేల కోట్లు, ఎంవీఆర్ టెక్స్టైల్స్ రూ.105.38 కోట్లు, చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో బెంగుళూరుకు చెందిన జీనియస్ ఫిల్టర్స్ సంస్థ రూ.120 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా, హిందూపురంలో అరవింద్ అపెరల్ పార్క్ సంస్థ రూ.20 కోట్లు, గుంటూరులో వామిని ఓవర్సీస్ ప్రైవేటు లిమిటెడ్ రూ.35 కోట్లు, అనకాపల్లిలో బీక్యూ టెక్స్టైల్స్ సంస్థ రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని పేర్కొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :