రూ.603 కోట్లతో 498 ఆలయాల అభివృద్ధి – అధికారులందరూ చిత్తశుద్దితో పనిచేయాలి దేవాదాయ శాఖ సమీక్షలో మంత్రి రామనారాయణరెడ్డి నెల్లూరు (వైద్యం) : భక్తులకు దేవాదాయ శాఖపై నమ్మకం, భగవంతు నిపై ప్రగాఢ విశ్వాసం కలిగించేలా దేవాదాయ శాఖ అధికారులందరూ భగవంతుని సేవలో చిత్తశుద్ధితో పని చేస్తూ, ఆలయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం ఉదయం నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో నెల్లూరు జిల్లాలోని దేవాదాయశాఖ అధికారులు, ఇంజనీర్లు, స్తవథులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆలయాల పునర్నిర్మాణ పనులు, ధూపదీప నైవేద్యం పథకం అమలు, గ్రామ దేవతల ఆలయాల నిర్మాణాలపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
TTD: వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ కీలక నిర్ణయం.. కొత్త దర్శనం రూల్స్ విడుదల

Temples as spiritual centers: Minister Ramanarayana Reddy
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ… కాశీ బుగ్గ తరహా ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రైవేటు ఆలయ నిర్మాణాలపై దేవాదాయవాఖ అధికారుల పర్యవేక్షణ ఉండేలా త్వరలోనే చట్టం తీసుకొస్తున్నట్లు మంత్రి చెప్పారు. భగవంతుని ఆరాధ కేంద్రాలైన ఆలయాల్లో ఎవరు ఎటువంటి తప్పులు చేసిన శిక్షలు తప్పవని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి అన్నారు. ఆగమశాస్త్ర విషయాల్లో కేవలం వేదపండితులు, ఆలయ అర్చకులకే పూర్తి నిర్ణయాధికారాలు ఉంటాయని, అధికార యంత్రాంగానికి స్థానం లేదని, కేవలం పరిపాలనా పరమైన అంశాల్లో మాత్రమే అధికారుల ప్రమేయం ఉండేలా చట్టం తీసుకొచ్చినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
ఆలయాల పునర్నిర్మాణ పనులకు నిధులు మంజూరు
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పురాతన, చారిత్రాత్మక ఆలయాల పనర్నిర్మాణా లకు కోట్లాది రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం ఈ నెల 18 నెలల పాలనలో 288 ఆలయాలకు 221 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో ఉన్న పాతవి, తాము మంజూరు చేసినవి అన్నీ కలిపి సుమారు 498 ఆలయాల అభివృద్ధికి 603 కోట్ల రూపాయలను దేవాదాయశాఖ, దాతల సహకారంతో ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లాలో 58 ఆలయాల పునర్నిర్మాణ వనులు చేపడుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఆలయాలను అభివృద్ధి చేస్తూ, సనాతన హిందూధర్మం, ఆలయాల పవిత్రతను కాపాడుతూ భక్తుల జయజయ ధ్వానాలతో ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు దేదీప్యమానంగా వెలుగొందేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా. దేవాదాయశాఖ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి, అన్ని ఆలయాల ఈవోలు, ఇంజనీర్లు స్తపథులు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: