AP Teachers: విజయవాడ : సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు ప్రస్తుతం పని చేస్తున్న టీచర్లకూ అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 2011కు ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన టీచర్లకూ టెట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1న తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి రెండేళ్లలో ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి అవసరంలేదని, అయితే వారు పదోన్నతి పొందాలంటే టెట్ పాసవ్వాలని సూచించింది. సుప్రీం కోర్టు (supreme court) తీర్పుపై ఇపపటికే కొన్ని సంఘాలు రివ్యూ పిటీషన్లు వేశాయి. ఈ తీర్పుకోసం వేచి ఉండే వారికే వెసులుబాటు కల్పిస్తారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ షెడ్యూలును విడుదల చేయనుంది.
Read also: RRB: రైల్వేలో భారీ NTPC ఉద్యోగావకాశాలు

AP Teachers: టీచర్లకు ‘టెట్’ రెండు రోజుల్లో నోటిఫికేషన్
ఈసారి అర్హత తగ్గింపు లేదు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీలో 40% మార్కులున్నా బిఇడిలో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ సడలింపుతో బిఇడి పూర్తి చేసిన అభ్యర్థులు ఆ తర్వాత టెట్ రాయాలంటే 45% అర్హత మార్కులు అవసరమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ నిబంధనను సడలిస్తూ 40% ఉన్నా టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈసారి 45% అర్హత మార్కులనే అనుసరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రెండు రోజుల్లో ఇవ్వనున్న టెట్లో 2011కు ముందు, ఆ తర్వాత విద్యార్హతలను నిర్ణయించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్హతల్లో కనీస మార్కులు ఉండాలనే దానిపై ఇంత వరకు స్పష్టత రాలేదు. 2011కు ముందు అభ్యర్థులు టెట్ రాసేందుకు ఎస్జీటీలకు ఇంటర్మీడియట్లో ఒసిలకు 45% బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికో ద్యోగులకు 45% మార్కులు ఉండాలి. పేపర్-2 రాసేవారికి సైతం నిర్ణీత అర్హతలో ఓసీలకు 50%,ఇతరులకు 45% మార్కులు ఉండాలి.
ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు టెట్ రాసే అవకాశం ఉందా?
అవును. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో 2011కు ముందు టెట్ లేకుండా ఉద్యోగంలో చేరిన టీచర్లకూ టెట్ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది?
రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: