AP teachers attendance rules : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల హాజరు వ్యవస్థపై పాఠశాల విద్యాశాఖ కొత్త కఠిన నిబంధనలు అమలు చేసింది. సమయపాలన, క్రమశిక్షణ మెరుగుపర్చాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు పాఠశాలకు చేరుకోవడం తప్పనిసరి. ఆ సమయం తర్వాత హాజరు నమోదు చేస్తే ‘లేట్ ఇన్’గా పరిగణిస్తారు. నెలలో కేవలం ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే 10 నిమిషాల గ్రేస్ సమయం అనుమతిస్తారు.
హాఫ్-డే సెలవులకు కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఉదయం సెలవు తీసుకుని మధ్యాహ్నం విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు మధ్యాహ్నం 1 గంటలోపు హాజరు నమోదు చేయాలి. ఆ తర్వాత వస్తే లేట్‌గా పరిగణిస్తారు. అలాగే ఉదయం విధులకు హాజరై మధ్యాహ్నం సెలవు తీసుకునే వారు 12:30 గంటలకు ముందు ఔట్ టైమ్ నమోదు చేయరాదు.
Read Also: CJI visit AP: కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ
పాఠశాల ముగిసే సమయానికి సంబంధించి కూడా కఠిన (AP teachers attendance rules) నిబంధనలు అమలులోకి వచ్చాయి. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సాయంత్రం 3:30 గంటల కంటే ముందుగా ఔట్ టైమ్ నమోదు చేస్తే, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సాయంత్రం 4 గంటల ముందు నమోదు చేసినా ‘ఎర్లీ ఔట్’గా పరిగణిస్తారు. ముఖ్యంగా ఇన్-టైమ్ నమోదు చేసి ఔట్-టైమ్ నమోదు చేయకపోతే, ఆ రోజంతా గైర్హాజరుగా లెక్కిస్తారు.
ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిమిషం ఆలస్యమైనా గైర్హాజరు గా పరిగణించడం కఠిన చర్య అని పేర్కొంటున్నారు. హాజరు నమోదు యాప్ సాంకేతిక సమస్యల కారణంగా కొన్నిసార్లు పనిచేయదని, అటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ నిబంధనలను పునఃసమీక్షిస్తుందా లేదా యథాతథంగా అమలు చేస్తుందా అనేది చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: